E-Paper
Advertisement

Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!

Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!
Advertisement

Telangana BJP Chief: దిల్లీ లిక్కర్ కేసుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక కారణాల రిత్యా లిక్కర్ కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసిందన్నారు. అంతమాత్రాన అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత తప్పు చేయలేదని అర్థం కాదన్నారు. కేసును డిశ్చార్జ్ చేసినంత మాత్రాన నిర్దోషులు అయిపోరని పేర్కొన్నారు. అలా భావిస్తే ఇది వారి అమాయకత్వమే అవుతుందని విమర్శించారు.

‘సీబీఐ అప్పీల్‌కు వెళ్లొచ్చు’

దిల్లీ లిక్కర్ కేసుపై తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి సీబీఐ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని రామచందర్ రావు అభిప్రాయపడ్డారు. బహుశా పైకోర్టులో దీనిని సవాలు చేసే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుత తీర్పు కేవలం ట్రయల్ కోర్టు నుంచి వచ్చినది మాత్రమేనని స్పష్టం చేశారు.

కవిత, కేజ్రీవాల్‌కు ప్రశ్నలు

Advertisement

మరోవైపు దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితకు టీబీజేపీ చీఫ్ సూటి ప్రశ్న సంధించారు. తాను ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్, సిమ్ కార్డును ఎందుకు కాల్చేశారని ప్రశ్నించారు. అటు దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మద్యం పాలసీని మార్చుకోవాల్సినంత అవసరం ఏమి వచ్చిందని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీనే కారణం

అయితే దిల్లీ లిక్కర్ కేసు విచారణతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రామచందర్ రావు స్ఫష్టం చేశాలు. దిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద తొలుత సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. 2022లోనే హస్తం పార్టీ నేతలు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2024లో దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీలు ఎంటర్ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: Kolkata Earthquake: దేశంలో భూకంపం.. కోల్‌కతాలో భారీ ప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం

‘కేసు కొట్టివేతకు కారణమిదే’

దిల్లీ లిక్కర్ కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేయడం వెనకున్న అసలు కారణాన్ని సైతం రామ చందర్ రావు బయటపెట్టారు. దర్యాప్తు అధికారులు కోరిన డాక్యుమెంట్స్ ను ముద్దాయిలు ఇవ్వలేదని అంచనా వేశారు. కాబట్టే హైకోర్టు అడిగిన సమాచారాన్ని సీబీఐ అందించలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదని.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ రామచందర్ రావు హెచ్చరించారు.

Also Read: MV Soundara Rajan: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర రాజన్ కన్నుమూత

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×