Rainy Season Bike Safety Tips:మాములుగా ఉన్నప్పుడే కాస్త ఏమరుపాటుగా ఉంటె బైక్ లు రోడ్లపై పల్టీలు కొడుతుంటాయి.అలాంటిది అసలే వర్షాకాలం..రోడ్లపై నీళ్ళు ,మట్టి ,రాళ్ళు ఇలా అన్నీ వచ్చి చేరుతుంటాయి .మన వంతుగా ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.అందుకే వర్షాకాలం బైకులపై వెళ్తున్నప్పుడు పలు ముఖ్యమైన జాగ్రత్తలు తప్పని సరి.అవేంటో ఒకసారి చూద్దాం.
ముందుగా మీరి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్ అసలు మర్చిపోవద్దు.వర్షం ఏమీ లేదు కదా అని నిర్లక్ల్ష్యం చేస్తుంటారు కొందరు,ఆతర్వాత సడెన్ గా వర్షం పడితే అయ్యో తెచ్చుకోవాల్సిందే అని తడుస్తూ బాధ పడిపోతుంటారు.పైగా మీ వద్ద ఏమైనా ముఖ్యమైన పత్రాలు గనుక ఉన్నాయంటే ఇక అవి వర్శార్పనమే .కాబట్టి బద్దకించకుండా ముందు రెయిన్ కోట్,వాటర్ ప్రూప్ వంటివి తీసి మీ బళ్ళో పెట్టుకోండి .
ఇక మనం పెట్టుక్జునే హెల్మెట్ చాలాముఖ్యం .అది మీ తలకి ఫిట్ అవుతుందో లేదో సరిగా చెక్ చేసుకోండి లూస్ గా ఉంటే మాత్రం మంచిది తీసుకోవడం ఉత్తమం లేదు.హెల్మెట్ ఏ కదా అని నిర్లక్ష్యం చేస్తే అది కాస్తకళ్ళ మీదికి చేరి రోడ్డు కనిపించకుండా బైక్ ని కింద పడేయడం పక్కా.ఇక హెల్మెట్ కి ఉండే వైజర్ ని కూడా నీట్ గా ఉంచుకోవడం ఉత్తమం.ఎప్పటికప్పుడు వైజర్ ని తూడ్చుకుంటూ ఉంటె దారి సరిగ్గా కనిపిస్తూ ఉంటుంది.
ఇక బైకులకు ఉండే టైర్లు మంచిగా క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఈ టైర్ల వల్లే ఒక్కొక్కసారి రోడ్లపై స్కిట్ అవుతూ పడిపోతుంటాం.కాబట్టి టైర్లు అరిగితే గనుక సరియైనవి వేసుకోవడం మంచిది.ఇక టైర్లలో గాలి ఉందా,ఏదైనా పంక్చర్ అయిందా..? వంటి విషయాలని బైక్ ఎక్కక ముందే సరి చూసుకోవడం మంచిది.
ఇక చాలామంది ఈ వర్షాకాలంలో రయ్యుమని 80,90 స్పీడ్ లో వెళ్తుంటారు .అలా స్పీడ్ గా వెళ్తే గనుక వారు యమధర్మరాజుని ఆహ్వానించినట్టే.అసలే రోడ్లపై ఉండే తడి కారణంగా టైర్లకి రోడ్డుపై గ్రిప్ తగ్గిపోతుంది.కాబట్టి వీలైనంత త్వరగా మెల్లిగా బైక్ పై వెళ్లడం మంచిది. ఇక చాలామంది మలుపుల్లో కూడా బైక్ ని స్పీడ్ గా తోలుతుంటారు .
మలుపులు, బ్రిడ్జిలు, గుంతలు వంటి ప్రాంతాల్లో వెనుక ఆ స్పీడ్ అలాగే మెయింటేన్ చేశారంటే రోడ్డుపై బండిని కంట్రోల్ చేయలేక అడ్డంగా పడిపోవడం పక్కా.కాబట్టి బైక్ స్పీడ్ ని మన కంట్రోల్ లో ఉంచుకుంటే మలుపులు వచ్చినప్పుడుబండిని స్కిడ్ కాకుండా చూసుకోవచ్చు,
ఇక ఈ వర్షాకాలంలో బండికి బండికి మధ్య గ్యాప్ ఉండడం చాలా ముఖ్యం.ఎందుకంటే ముందు వాహనం కనుక సడన్ బ్రేక్ వేస్తే మన బండిని ఆపుకోలేక కింద పడే అవకాశం ఉంటుంది మరియు పెద్ద పెద్ద వాహనాలు అంటే లారీలు, బస్సులు, కార్లు వంటి వాటి వెనకాలే వెళ్తే వాటి టైర్లు చిమ్మే నీళ్ల వల్ల రోడ్డు కనిపించే అవకాశం తక్కువ ఉంటుంది.కాబట్టి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది.
రోడ్డుపై నీరు ఉన్నప్పుడు కాస్త నిదానంగా వెళ్తే మంచిది ఎందుకంటే ఈ వర్షా కాలంలో రోడ్డుపై మ్యాన్ హోల్ తీసి ఉంచడం కాని,కనిపించని గుంతలు ఉండే అవకాశం కాని ఉంటుంది. సో మనకు వీలైనంత మటుకు అధికంగా నీళ్లు నిలిచి ఉండే రోడ్లని అవాయిడ్ చేయడం మంచిది.ఈ వర్షాకాలం పెయింటింగ్ వేసిన తడిభాగాలు ఉంటె జారే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా బైక్ యొక్క హెడ్ లైట్,ఇండికేటర్ల టైలైట్ అన్ని సరిగా పనిచేస్తున్నాయా లేదో ముందే చెక్ చేసుకుంటే మంచిది.ఇక భారీ వర్షం గనుక కురిస్తే అలాగే ముందుకు వెళ్లకుండా ఆగితే మంచిది .ఎందుకంటే మీరు మీరు జాగ్రత్తగా ఉన్నా ఈ వర్షాకాలంలో చెట్లు,స్తంభాలు కూలి పడటం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువ .కాబట్టి వర్షం తగ్గిన తర్వాతే బయలుదేరడం మంచిది.
ఇక చాలామంది వర్షాకాలంలో సరదాగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జర్నీ చేస్తుంటారు అలా చేస్తే మీకు వెనకాల నుంచి కొట్టే హారర్లు వినపడకపోవచ్చు.కాబట్టి వర్షాకాలంలో ఇయర్ ఫోన్స్ వాడకపోవడం మంచిది.
ఇక వర్షాకాలంలో బయట తిరిగి వచ్చిన తర్వాత బైక్ ని నిర్లక్ష్యం చేయకుండా, బైక్ ని నీట్ గా ఆరబెట్టుకుంటే మంచిది . బైకు నడిపిస్తున్నప్పుడు మీకు బైక్ లో ఏమైనా తేడా కొట్టినా , ఏదైనా అనుమానం వచ్చినా మెకానిక్ కి చూపించండి .
మరి ఈ టిప్స్ అన్నీ పాటించి ఈ వర్షాకాలం లో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రతగా ఉంటారు కదూ !