Rohit Naidu : రోహిత్ నాయుడు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించిన రోహిత్ కచ్చితంగా విన్నర్ అవుతారని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా రోహిత్ నాయుడు (Rohit Naidu) ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోయిందంటే రోహిత్ క్రేజ్ ఎలా ఉండేదో స్పష్టమవుతుంది. రోహిత్ ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.
తాను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తానని చిన్న ఆశ ఉండేది కానీ బిగ్ బాస్ ప్రయాణానికి ముగింపు పలికాను అంటూ తన రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రోహిత్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్ నాగార్జున ఇటీవల కులకడం(Kulakadam ) అనే పదానికి సరికొత్త అర్థం చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసాయి. తాజాగా రోహిత్ నాయుడు సైతం కులకడం అనే పదం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా రోహిత్ నాగార్జున చెప్పిన కులకడం అనే పదం గురించి మాట్లాడుతూ… నాగార్జున గారు మాట్లాడుతూ కులకడం అంటే వయ్యారాలు పోవడం అని స్పష్టంగా చెప్పారు. వారి దృష్టిలో అదొక మంచి పదమే. కానీ మా ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడితే చీపురు తిరిగేస్తారు అంటూ రోహిత్ నాయుడు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఇలా రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ సందర్భాన్ని బట్టి కులకడం అనే పదానికి అర్థం మారుతుందని కామెంట్లు చేయగా, మరికొందరు నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు నీతి సూక్తులు మాట్లాడవా.. హౌస్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్టేనా అంటూ నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించిన చాలా సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారని కూడా రోహిత్ తెలిపారు. అలాగే రోహిత్ ఎలిమినేట్ కావడంతో పలువురు నాగార్జున పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దయచేసి అలాంటి విమర్శలు చేయొద్దు అంటూ ఈయన తన అభిమానులకు సూచనలు చేశారు.
Also Read: సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !