E-Paper
Advertisement

తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?

తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?
Advertisement

Tamil Nadu Data Leak: తమిళనాడులో ఇప్పుడు డేటా లీక్ కలకలం రేపుతోంది. గ్లోబల్ కంపెనీలతో జరిగిన టాప్ సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్ వివరాలు.. పొరుగు రాష్ట్రం ఏపీకి చేరాయన్నది మెయిన్ ఎలిగేషన్. నాన్-డిస్‌క్లోజర్ రూల్స్ బ్రేక్ చేశారంటూ.. గైడెన్స్ తమిళనాడుకు చెందిన 15 మందిపై వేటు పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. అక్కడి నుంచి బయటికొచ్చిన ముగ్గురు కీ-ప్రొఫెషనల్స్.. నేరుగా ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డులో చేరిపోవడం ఈ కథకు మరింత మసాలా అద్దిన్నట్లయ్యంది.

లీకా.. రీషఫిలా?

Advertisement

తమిళనాడు ఇండస్ట్రీ వర్గాలు ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నాయి. లీక్ లేదు, లింక్ లేదు.. అంతా అడ్మినిస్ట్రేటివ్ రీషఫిల్ అంటున్నాయి. వాళ్లంతా పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు.. జస్ట్ కాంట్రాక్ట్‌ బేసిస్‌పై పనిచేసే ప్రొఫెషనల్స్ మాత్రమేనని క్లారిటీ ఇస్తున్నాయి. తమిళనాడులో పవర్ మారిన తర్వాత కొత్త లీడర్‌షిప్ వచ్చింది. పాత టీమ్‌కు అక్కడ సింక్ అవ్వకనే వాళ్లు జాబ్స్ మానేశారు తప్ప.. ఇందులో ఎలాంటి స్కామ్ లేదన్నది వాళ్ల వెర్షన్.

ప్రభుత్వాలతో డైరెక్ట్‌గా టేబుల్‌మీదే డీల్

Advertisement

మల్టీనేషనల్ కంపెనీలు ఎప్పుడూ ఒకే రాష్ట్రానికి ఫిక్స్ అవ్వవు. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో డైరెక్ట్‌గా టేబుల్‌మీదే డీల్ మాట్లాడతాయి. అలాంటప్పుడు ఒక రాష్ట్రం డేటా మరో రాష్ట్రానికి లీక్ చేయాల్సిన అవసరమే ఉండదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రైవేట్ సెక్టార్‌లో బెటర్ ఆఫర్ కోసం కంపెనీలు మారినట్టే, ఇక్కడా ఎక్స్‌పర్ట్స్ రాష్ట్రం మారారన్నది వీరి వాదన.

లేక్ నిజమా, లేక లేబుల్ మాత్రమేనా?

ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం స్టేట్స్ మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. కానీ అది అనుమానాలు, ఆరోపణల దాకా వెళ్తే ఇండస్ట్రీ వర్గాల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఈ 15 మంది ఎగ్జిట్ వెనుక నిజంగానే డేటా లీక్ ఉందా? లేక రొటీన్ జాబ్ షిఫ్ట్‌ను హైప్ చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇన్వెస్టర్లకు కావాల్సింది పొలిటికల్ డ్రామాలు కాదు.. స్టేబుల్ పాలసీలు, ఫాస్ట్ క్లియరెన్సులు. సో, లీక్ నిజమా, లేక లేబుల్ మాత్రమేనా? తేలే వరకు ఈ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

Also Read: చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్

Tags

Related News

కాటేసిన కల్తీ మద్యం.. 15 మంది మృతి, ఆసుపత్రిలో 180 మంది, మణిపూర్‌లో ఊహించని దారుణం

పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!

భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు

కాంగ్రెస్ మిషన్- 2029.. పార్టీలో భారీగా ప్రక్షాళన, రాహుల్ ‘సామాజిక న్యాయం’ మార్క్

లోయలో పడిన మినీ బస్సు, స్పాట్‌లో 24 మంది, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

అజిత్ ధోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. అసలేం జరిగింది? ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూ?

ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు.. పోలీసులే షాక్!

Big Stories

Advertisement
×