Hair Split Ends: స్ప్లిట్ ఎండ్స్ అంటే జుట్టు పొడిబారడం లేదా చివర్లు దెబ్బతినడం. జుట్టు చివర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విరిగిపోవడాన్ని స్ప్లిట్ ఎండ్స్ అని అంటారు. స్ప్లిట్ చివరలను కత్తిరించడం ద్వారా వీటిని వదిలించుకోవచ్చు. కానీ ఈ పద్దతి ప్రతీ సారి అతంత ప్రభావవంతగా పని చేయదు. ఇదిలా ఉంటే స్ప్లిట్ ఎండ్స్ మీ జుట్టును మరింత దెబ్బతీస్తాయి. అంతే కాకుండా జుట్టు అందాన్ని కూడా పాడు చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా మీరు జుట్టు చివర్లు ఎందుకు చీలిపోతాయో కారణాలేమిటో తెలుసుకోవాలి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అతిగా వాష్ చేయడం:
మన జుట్టును శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తలపై ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కానీ జుట్టును ఎక్కువగా వాష్ చేయడం వల్ల దాని సహజ నూనెలు కోల్పోతుంది. దీని కారణంగా మీ జుట్టు మరింత పొడిగా, బలహీనంగా మారుతుంది. ఫలితంగా చివర్లు చీలిపోయే ప్రమాదం పెరుగుతుంది.
షాంపూలు, కలర్స్ వాడకం:
చాలా మంది హెయిర్ స్టైల్స్ తో పాటు కలర్స్ వేయడానికి రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఈ రసాయనాల వాడకం మీ జుట్టు యొక్క సహజ తేమను తొలగిస్తాయి. దీని కారణంగా జుట్టు పొడిగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు విరిగిపోయే ప్రమాదం మరింత పెరుగుతుంది. నిజానికి రసాయనాలు జుట్టును లోపలి నుండి బలహీన పరుస్తాయి. అంతే కాకుండా బయటి నుండి కూడా దెబ్బతీస్తాయి. ఇది చివరలను ఇది జుట్టు చీల్చడానికి దారితీస్తుంది.
హీట్-స్టైలింగ్:
జుట్టు దెబ్బతినడానికి ,స్ప్లిట్ ఎండ్స్ రావడానికి హీట్-స్టైలింగ్ ప్రధాన కారణం. వేడిని ఉపయోగించి మీ జుట్టును స్ట్రెయిట్ చేయడం వల్ల జుట్టు మరింత వేడెక్కుతుంది. దీనివల్ల చివరలు చిట్లడం జరుగుతుంది. హీట్ ప్రొటెక్టెంట్ జుట్టును వేడి , హానికరమైన ప్రభావాల నుండి రక్షించడమే కాకుండా, జుట్టుకు తేలికపాటి కండిషనింగ్ పోషణను కూడా అందిస్తుంది.
ఎక్కువగా దువ్వడం:
జుట్టును దువ్వుకోవడం తప్పనిసరి. కానీ అతిగా చేయడం వల్ల జుట్టు తెగిపోతుంది. ఎక్కువగా బ్రష్ చేయడం వల్ల మీ జుట్టు లోపలి నుండి విరిగిపోయి చివరలు చీలిపోతాయి. అందుకే దీనిని నివారించడం చాలా ముఖ్యం.
Also Read: కాఫీ పౌడర్‌తో ఫేషియల్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం
చెడు వాతావరణం, కాలుష్యం:
గాలి, వర్షం, ఎండ, కాలుష్యం, జీవనశైలి వంటి కొన్ని పర్యావరణ పరిస్థితులు కూడా జుట్టు నాణ్యతను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ జుట్టు చివర్లు చిట్లుతాయి. అటువంటి పరిస్థితిలో, వీటన్నింటినీ నివారించడానికి ప్రయత్నించండి.
ఆహార లోపం:
మీ ఆహారంలో అవసరమైన విటమిన్లు , ఖనిజాలు లేకుంటే అది మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల జుట్టులో తేమ తగ్గి, జుట్టు పొడిబారి, విరిగిపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి.