BigTV English
Advertisement

Coffee Facial: కాఫీ పౌడర్‌తో ఫేషియల్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Coffee Facial: కాఫీ పౌడర్‌తో ఫేషియల్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Coffee Facial: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటి వల్ల అంతగా ఫలితం ఉండదు. కానీ తక్షణ మెరుపు పొందడానికి కాఫీతో ఫేషియల్ చేయవచ్చు. ఫేషియల్ మొదటి దశలో, ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేస్తారు. ఇందుకోసం ఒక చెంచా కాఫీ పొడిని పచ్చి పాలలో కలపండి. ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి ముఖం మీద అప్లై చేయండి. రెండు నుండి మూడు నిమిషాలు కాటన్ బాల్ సహాయంతో సున్నితంగా రుద్దండి. దీని తర్వాత నీటితో కడగాలి.


కాఫీ ఫేస్ మాస్క్:
ఫేషియల్ యొక్క రెండవ దశలో ముఖాన్ని స్క్రబ్ చేయండి. దీని కోసం కాఫీ పొడి, కాస్త మెత్తని బియ్యం పిండి తీసుకొని వీటినిరోజ్ వాటర్ సహాయంతో కలపండి. తర్వాత ముఖానికి అప్లై చేసి చేతులతో స్క్రబ్ చేయండి. ముఖం , మెడ మొత్తాన్ని స్క్రబ్ చేసిన తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. మీకు కావాలంట కాఫీలో కొద్దిగా ముతక చక్కెర కలిపి మీ చేతులు, కాళ్ళను స్క్రబ్ చేయవచ్చు. దీనితో మెరుపు తక్షణమే కనిపించడం ప్రారంభమవుతుంది.

ఫేస్ ప్యాక్ :
ఫేషియల్ యొక్క మూడవ దశలో ముఖంపై కాఫీ ఫేస్ మాస్క్ వేయండి. దీని కోసం అర టీస్పూన్ కాఫీ పొడిని తీసుకుని అందులో అర టీస్పూన్ గంధపు పొడిని కలపండి. తర్వాత దానికి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖం నుండి మెడ వరకు అప్లై చేసి దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచండి. లేదా అది ఆరిపోయే వరకు తర్వాత ముఖం మొత్తాన్ని మంచినీటితో కడగాలి.


డార్క్ సర్కిల్స్:

ఇంట్లోనే కాఫీ ఫేషియల్ తయారు చేసుకుని వాడటం వల్ల తక్షణ గ్లో వస్తుంది. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటే దీని కోసం కాఫీ పొడిని తేనెలో కలపండి. తర్వాత దాన్ని బాగా కలిపి కళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై అప్లై చేయండి. ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఈజీగా తొలగిపోతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా ఈ ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుంది. కాఫీలో ఉండే పోషకాలు చర్మాన్ని చాలా కాంతి వంతంగా మారుస్తాయి. అంతే కాకుండా ముఖంపై మచ్చలు రాకుండా చేస్తాయి.

Also Read:  కొబ్బరి నూనె ఇలా వాడితే.. మచ్చలేని చర్మం

కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.  కాఫీ పౌడర్ లో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను కూడా తగ్గిస్తాయి. కొన్ని రకాల పదార్థాలు కాఫీ పౌడర్ లో కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవడం అద్భుత ఫలితాలను ఇస్తుంది. బయట మార్కెట్ లో దొరికే ఫేస్ మాస్కులను బదులుగా  ఇలాంటి నేచురల్ ఫేస్ మాస్కులు వాడటం వల్ల ముఖం కాంతివంతగా మెరుస్తుంది.

 

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×