iPhone SE 4 Launching Date: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ లకు ఉండే క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఫోన్ చాలా మంది ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అందుకే, కొత్త ఐఫోన్ విడుదల అవుతుందంటే చాలు, స్టోర్ల ముందుకు టెక్ ప్రియులు క్యూకడతారు. కొత్త ఐఫోన్ చేతికి రాగానే ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీలవుతారు. ఐఫోన్ లవర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది.
సామాన్యులకు అందుబాటు ధరలో iPhone SE 4
ఇక ఐఫోన్ ఎస్‌ఈ (iPhone SE) సిరీస్ లో లేటెస్ట్ ఫోన్ కోసం ఆపిల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లతో పోల్చితే ఈ ఫోన్ ధర సామాన్యులకు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని వేచి చూస్తున్నారు. అయితే, సరికొత్త ఆపిల్ ఐఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్(Tim Cook) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఫిబ్రవరి 19న iPhone SE విడుదల
ఆపిల్ లేటెస్ట్ ప్రొడక్ట్ iPhone SE ఫిబ్రవరి 19న మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టిమ్ కుక్ వెల్డించారు. సిల్వర్ కలర్ లో మెరిసిపోతున్న ఆపిల్ లోగోను ఆయన షేర్ చేశారు. అయితే, ఏ ప్రొడక్ట్ తీసుకురాబోతున్నారు అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే, ఆపిల్ కంపెనీకి చెందిన ఫోర్త్ జెనరేషన్ SE మోడల్ ను తీసుకురానున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే, టిమ్ కుక్ ‘మా ఫ్యామిలీలోకి మరో కొత్త మెంబర్ రాబోతున్నారు’ అంటూ టిమ్ కుక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం పట్ల కచ్చితంగా అదే ఫోన్ మార్కెట్లోకి రాబోతుందంటూ అందరూ భావిస్తున్నారు. టెక్ వర్గాలతో పాటు ఆపిల్ లవర్స్ కూడా కచ్చింతగా రాబోయేది iPhone SE ఫోనే అంటున్నారు.
Get ready to meet the newest member of the family.
Wednesday, February 19. #AppleLaunch pic.twitter.com/0ML0NfMedu
— Tim Cook (@tim_cook) February 13, 2025
Read Also: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!
iPhone SE ఫీచర్లు!
iPhone SE సిరీస్ కు సంబంధించి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. 2022లో చివరగా ఈ ఆపిల్ SE ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు మూడు సంవత్సరాల తర్వాత ఈ సిరీస్ లో కొత్త ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ స్టార్ట్ ఫక్షన్ కూడా హోమ్ బటన్, టచ్ ఐడీ లేకుండా ఫేస్ ఐడీ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఇంటెలిజెన్స్, USB టైప్- సి పోర్ట్, ఏ18 చిప్ సెట్ తో ఈ ఫోన్ రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి బేస్ వేరియంట్ ధర రూ.43,900గా ఉండవచ్చని తెలుస్తోంది.
Read Also: మీ జేబులో ఫోన్‌ను ఎంత సేపు పెట్టుకుంటున్నారు? సంతానంపై ఆశలు వదిలేసుకోండి!