ChatGPT Search Vs Google : చాట్ జీపీటీ (ChatGPT)… తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్ సర్చ్ ఇంజన్ Googleకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. సెలెక్టడ్ బ్రౌజర్స్ లో డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్‌గా సెట్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఇక ప్రస్తుతం ప్లస్, టీమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బ్రౌజింగ్… త్వరలోనే పూర్తి స్థాయి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
గ్లోబల్ మార్కెట్లో దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గా గూగుల్ కొనసాగింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా తన సేవలను గూగుల్ విస్తరించే పనిలోనే ఉంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ సర్చ్, గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్ ఇలా ప్రతీ చోటా గూగుల్ హవా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గూగుల్ కు ప్రత్యమ్నాయంగా తాజాగా పలు సర్చ్ ఇంజన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి OpenAI సత్తా చాటుతుండగా.. తాజాగా శామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని వచ్చేసిన చాట్‌జిపిటీ (ChatGPT) సర్చింగ్ కు మరో బెస్ట్ సెర్చ్ ఆఫ్షన్ గా నిలుస్తుంది. ఇది ఓపెన్‌ఏఐకు సపోర్ట్ చేసే మైక్రోసాఫ్ట్ తో నడుస్తుంది.
OpenAI సర్చ్ ఇంజన్ లాంఛ్ అయ్యి దాదాపు 2 వారాలు అయినప్పటికీ.. ఇప్పటికీ చాాలా మంది వినియోగదారులకు ChatGPTను సర్చ్ కు అనుకూలంగా మార్చుకొని.. ప్రతీసారి గూగుల్ లో కావల్సిన రిజల్ట్స్ వెతకాల్సిన పనిలేదని తెలియదు. ఇక ఈ సెట్టింగ్స్ తో తేలికగా ChatGPTను డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ గా మార్చేసుకోవచ్చు.
ALSO READ : ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్.. ఎలాగంటే!
ChatGPTను డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్‌గా ఎలా సెట్ చేయాలంటే..
ChatGPTను అన్ని Chromium ఆధారిత బ్రౌజర్‌లలోనూ డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్‌గా సెట్ చేయవచ్చు. కాకపోతే ఇవి Chrome వెబ్ స్టోర్ నుంచి మెుత్తం సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంటే ChatGPTను Google Chromeలో మాత్రమే కాకుండా Microsoft Edge, Brave, Opera లాంటి ఫేమస్ బ్రౌజర్స్ లోనూ డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్‌గా సెట్ చేయవచ్చు.
ChatGPTను డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్‌గా సెట్ చేయడానికి, Google Chromeకి వెళ్లాలి. ఇందులో “ChatGPT Search” లేదా ThisLink పైన క్లిక్ చేయాలి. తర్వాత proceed to add the extensionను క్లిక్ చేయాలి. అనంతరం extension ట్యాబ్‌పైకి వెళ్లి బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ కనిపిస్తుందో లేదో చూసుకోవాలి.
ఇక కొన్ని బ్రౌజర్‌లు ChatGPT సెర్చ్ ఎక్స్‌టెన్షన్‌ను ఆటోమేటిక్‌గా ఆపగలగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ChatGPTని డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉంచటం, ఫేవరెట్ ట్రేలో ఎక్స్‌టెన్షన్‌కు జోడించటంతో తేలికగా సర్చ్ చేయగలిగే అవకాశం ఉంటుంది.
కొన్ని బ్రౌజర్స్ లో ChatGPT సర్చ్ ను ఎందుకు లేదంటే..
ChatGPT సర్చ్ ఇంజన్ ప్రస్తుతానికి ప్లస్, టీమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఎంటర్‌ప్రైజ్, ఎడ్యుకేషన్ కస్టమర్స్ కు అందుబాటులోకి వస్తుంది. OpenAI సైతం త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ChatGPT సర్చ్ అనేది SearchGPTకు లేటెస్ట్ వెర్షన్. SearchGPT వెయిట్‌లిస్ట్ కోసం అప్లై చేసుకుంటే.. సబ్స్కిప్షన్ లేకపోయినప్పటికీ ChatGPT సర్చ్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం… చాట్ జీపీటీను డీఫాల్ట్ సర్చ్ గా మార్చేసుకొని కావల్సిన వాటిని అడిగేయండి.