Rice Water For Glowing Skin: జుట్టు రాలడం నుంచి మచ్చలేని చర్మం వరకు అన్ని సమస్యలకు చెక్ పెట్టే దివ్వౌషదం రైస్ వాటర్.. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా లేటెస్ట్ స్కిన్ కేర్ ట్రెండ్‌లలో.. బియ్యం నీళ్లు మంచి గుర్తింపు పొందింది. కొరియన్ స్కిన్ కేర్ రహస్యం కూడా రైస్ వాటరేనట. బియ్యం నీళ్లు కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. అందంగా ఉండాలని ఎవరకి మాత్రం ఉండదు చెప్పండి. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో కనిపించే బ్యూటీ టిప్స్‌ను కూడా పాటిస్తుంటారు. అయినా ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి రైస్ వాటర్‌తో ఈ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రైస్ వాటర్, పొటాటో రసం, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, పొటాటో రసం, రైస్ వాటర్ రెండు స్పూన్లు , రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తొలగిపోతాయి.
రైస్ వాటర్, అలోవెరా జెల్, విటమిన్ క్యాప్సూల్స్
చిన్న గిన్నె తీసుకుని అందులో రైస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్యూల్స్ రెండు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై ముడతలు తగ్గి, తాజాగా మెరుస్తుంది.
రైస్ వాటర్, కాఫీ పొడి, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ రైస్ వాటర్, కాఫీ పొడి రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం టీ స్పూన్, షుగర్ టీ స్పూన్, తేనె టీ స్పూన్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత.. సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మురికి తొలగిపోయి.. కాంతివంతంగా మెరుస్తుంది.
శెనగపిండి, రైస్ వాటర్, పెరుగు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి, రైస్ వాటర్, పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గి మిల మిల మెరుస్తుంది.
Also Read: సిట్రస్ పండ్లు మంచివే.. కానీ అతిగా తింటే ఆ సమస్యలు రావచ్చు..!
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.