Big TV Kissik Talk Show :బుల్లితెరపై క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ జోడీలలో అమర్ దీప్ (Amardeep)- తేజస్విని గౌడ(Tejaswini Gowda) జంట కూడా ఒకటి. వీరిద్దరూ ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండటమే కాదు, తమ దాంపత్య జీవితంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా. ఇటీవల ఓంకార్ (Omkar) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నీతోనే 2.0’ అనే కార్యక్రమానికి జంటగా విచ్చేసి, చివరి వరకు పోరాడి లాస్ట్ మినిట్ లో రన్నర్ గా నిలిచారు. అయినా సరే ఈ జంట క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. అంతేకాదు అటు ఆడియన్స్ లో ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. స్టార్ సినీ సెలెబ్రిటీల రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ జంట. ఇకపోతే అమర్ దీప్ ది చాలా చిన్నపిల్లల మనస్తత్వం..ఆయనకు చాలా క్లోజ్ గా వుండే చాలా మంది ఇదే చెబుతారు కూడా.. అందుకే ఆయనకు ప్రతి క్షణం కూడా వెన్నంటే ఉంటూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది తేజస్విని గౌడ.
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన తేజస్విని కూడా..
ఒకవైపు భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూనే.. మరొకవైపు తెలుగు, తమిళ్ సీరియల్స్ లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా తాజాగా ఈమె ‘బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్’ గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్ షో ‘ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది. ఈ షో కి ప్రముఖ జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు పంచుకున్న ఈమె .. ముఖ్యంగా తమ మధ్య విడాకులు అంటూ ఎవరో కథనాలు అల్లేస్తున్నారు అని, అసలు ఇది ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందో తనకు తెలియదని, కానీ నీతోనే 2.0 కార్యక్రమం ద్వారా ఆ వార్తలకు చెక్ పెట్టామునంటూ విడాకుల వార్తలకు చెక్ పెట్టింది తేజస్విని.
బిగ్ బాస్ వల్ల అమర్ నరకం చూసాడు.. తేజస్విని
బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. “బిగ్ బాస్ సీజన్ 7 లో తన భర్త అమర్దీప్ టైటిల్ కోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హౌస్ లో వాళ్ళని గుడ్డిగా నమ్మి కెప్టెన్సీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయాను అనే బాధ ఆయనలో చాలా ఉండేదట. ఒకరకంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ వల్ల ఆ క్షణంలో కెప్టెన్సీ పొందలేకపోయాను అనే బాధ కారణంగా ఎవరికి చెప్పకుండానే తనలో తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయి నరకం అనుభవించాడు అంటూ కాస్త ఎమోషనల్ గానే మాట్లాడింది తేజస్విని గౌడ. అయితే కెప్టెన్సీ పదవి రాకపోయినా.. టైటిల్ విజేతగా నిలవకపోయినా చివర్లో ఆయన ఫేవరెట్ హీరో మాస్ మహారాజా రవితేజ (Raviteja)తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో.. ఆ క్షణం తనలో ఎన్నడూ చూడని ఆనందాన్ని చూశాను. తన అభిమాన హీరోనే తనకు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడాన్ని చూసి అమర్ నమ్మలేకపోయాడు. ఇక అప్పటివరకు బిగ్బాస్ ద్వారా పడిన కష్టం మొత్తం ఆవిరైపోయింది. కెప్టెన్సీ, టైటిల్ విజేత ఇలా ఏవి కాకపోయినా రవితేజ సినిమాలో అవకాశం లభించడంతో ఆ బాధలన్నింటిని మర్చిపోయాడు” అంటూ తేజస్విని తెలిపింది. ఏది ఏమైనా బిగ్ బాస్ లో అందరూ ఒకడినే టార్గెట్ చేసి నరకం చూపించినా.. రవితేజ వల్ల తనకు అంతా మంచే జరిగిందని చెప్పుకొచ్చింది తేజస్విని గౌడ.. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Vishwambhara: రాత్రింబవళ్లు కష్టపడుతున్న చిరు.. ఈసారైనా అనుకున్న టైం కి వస్తారా..?