Dalits beaten over Wages| ఇద్దరు దళిత కార్మికుల పట్ల ఒక ఫ్యాక్టరీ యజమాని పాశవికంగా ప్రవర్తించాడు. వారిని చితకబాది, కరెంట్ షాకులిచ్చి, వారి గోళ్లు పీకించేశఆడు. సమయానికి యజమాని వేతనం చెల్లించలేదని అడిగినందుకు వారిపైనే దొంగతనం నిందవేసి ఇంత రాక్షసంగా ప్రవర్తించాడు.
ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో జరిగింది. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన ఇద్దరు దళిత జాతి వ్యక్తులు కోర్బాలోని ఓ ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. రాజస్థాన్ లోని ఇద్దరు ఏజెంట్ల సాయంతో వారికి ఆ ఉద్యోగం లభించింది. శుక్రవారం వీరు యజమాని చోటూ గుర్జార్ వద్దకు వెళ్లి తమకు రావాల్సిన జీత భత్యాలు ఇవ్వాలని కోరారు.
కానీ ఆగ్రహించిన యజమాని గుర్జార్ ఈ ఇద్దరు దళిత యువకులు.. దొంగతనం చేశారనే అనుమానంతో తన సహాయకుడి చేత విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ కార్మికులను అర్ధనగ్నంగా నిలబెట్టి చితకబాదాడు. వారి శరీరానికి గాయ పరచడమే కాకుండా, వారి వేలి గోళ్లను దారుణంగా తీసేయించి, విద్యుత్ షాక్ ఇచ్చాడు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
దెబ్బలు తిన్ని ఆ దళిక కార్మికులు ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకుని తమ స్వగ్రామమైన భిల్వారాకు చేరుకున్నారు. అనంతరం వారు సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమపై జరిగిన ఘోరదాడి గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మొదటగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆపై కేసును కోర్బా పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేసి, అక్కడ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: ఒక్క రూపాయి కోసం హత్య.. కస్టమర్‌ని చంపిన పాన్ షాపు ఓనర్
బాధితుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని వ్యక్తిగత అవసరాల నిమిత్తం మా వేతనం నుంచి రూ.20 వేలు ఇవ్వమని యజమాని ఛోటూ గారిని అభ్యర్థించాం. కానీ అతను మాకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. డబ్బు ఇవ్వకపోతే ఉద్యోగం వదిలి వెళతామని మేము చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంలో అతను తీవ్రమైన కోపంతో మమ్మల్ని దాడి చేశాడు. భయపెట్టే విధంగా చిత్రహింసలకు గురిచేశాడు,’’ అని తెలిపాడు.