BigTV English

Rose Water: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. రోజ్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపి రాస్తే చాలు

Rose Water: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. రోజ్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపి రాస్తే చాలు

Rose Water: రోజ్ వాటర్‌ను చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తారు. ఇందులోని గుణాలు చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు , ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చాలా మంది దీనిని నేచురల్ టోనర్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే రోజ్ వాటర్‌లో పటిక కలిపి ముఖానికి వాడటం వల్ల దాని ప్రయోజనాలను రెట్టింపు చేయవచ్చు.


పటికలో యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మపై వచ్చు అలెర్జీతో పాటు మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్, పటిక యొక్క అద్భుతమైన మిశ్రమం చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది సహజమైన , సురక్షితమైన మార్గం, దీని ద్వారా మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా , మెరిసేలా చేసుకోవచ్చు.మరి రోజ్ వాటర్, పటికను గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా ఉపయోగించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ వాటర్ , పటిక మిశ్రమం ముఖానికి ఎలా ఉపయోగించాలి ?
ఫేస్ టోనర్: స్ప్రే బాటిల్‌లో రోజ్ వాటర్ నింపి, దానికి కొద్దిగా పటిక కలపండి. దీనిని ముఖానికి రెండు లేదా మూడు సార్లు స్ప్రే చేయండి.


ఫేస్ మాస్క్: పటిక పొడిని రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి.

ఐస్ క్యూబ్స్: రోజ్ వాటర్, పటిక మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్‌లో ఉంచండి. తర్వాత ఐస్ క్యూబ్స్‌ని మీ ముఖంపై రుద్దండి.

స్క్రబ్: రోజ్ వాటర్ , తేనెతో పటిక పొడిని కలిపి స్క్రబ్ చేయండి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత 10 నిమిషాలు ఆగి ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

రోజ్ వాటర్, పటిక యొక్క ప్రయోజనాలు:

మచ్చలను తగ్గిస్తుంది: రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. పటికలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మాన్ని టోన్ చేస్తుంది: రోజ్ వాటర్ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా పటిక చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. తద్వారా చర్మాన్ని టోన్ చేస్తుంది.

మృదువైన , మెరిసే చర్మం: రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా పటిక చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

వాపును తగ్గిస్తుంది: రోజ్ వాటర్, పటిక రెండూ చర్మం వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మాన్ని ‘బ్యాక్టీరియా రహితం’ చేస్తుంది: పటికలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా లేకుండా చేస్తాయి.

Also Read: రైస్ వాటర్‌తో.. మచ్చలేని చర్మం మీ సొంతం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రోజ్ వాటర్ , పటికను ఉపయోగించే ముందు తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేయండి.

మీకు ఏదైనా అలెర్జీలు ఉంటే వీటిని ఉపయోగించకండి.

మీ చర్మం సున్నితంగా ఉంటే వీటి వాడకాన్ని తగ్గించండి.

మీరు గర్భవతి, తల్లిపాలు ఇస్తున్నట్లయితే, దానిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

 

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×