Rice Water For Skin Whitening: రైస్ వాటర్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. రైస్ వాటర్ చర్మాన్ని మృదువుగా , మెరిసేలా మారుస్తుంది. అంతే కాకుండా బియ్యం నీరు చర్మానికి అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. రైస్ వాటర్ తరుచుగా అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
శతాబ్దాలుగా ఆసియా దేశాలలో చర్మ సంరక్షణ కోసం రైస్ వాటర్ సహజ నివారణగా ఉపయోగించబడుతోంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడమే కాకుండా అనేక ఇతర చర్మ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. రైస్ వాటర్ యొక్క గుణాలు ఏమిటి ? ఇది మన చర్మానికి ఎందుకు మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం నీళ్లలో ఉండే పోషకాలు:
బియ్యం నీటిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రైస్ వాటర్‌లోని విటమిన్-బిచర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు- యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్య సంకేతాలను ప్రోత్సహిస్తాయి.
అమైనో ఆమ్లాలు – అమైనో ఆమ్లాలు చర్మాన్ని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా కొల్లాజిన్ ఉత్పతిని ప్రోత్సహిస్తాయి.
ఖనిజాలు- జింక్, మెగ్నీషియం , పొటాషియం వంటి ఖనిజ మూలకాలు బియ్యం నీటిలో కనిపిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
రైస్ వాటర్ ప్రయోజనాలు:
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది- రైస్ వాటర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా స్కిన్‌పై ఉన్న జిడ్డును కూడా తొలగిస్తాయి.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది- బియ్యం నీళ్లలో ఉండే అమినో యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలు తగ్గిస్తాయి.
చర్మానికి పోషణనిస్తుంది- బియ్యం నీరు చర్మానికి పోషణనిస్తుంది. అంతే కాకుండా హైడ్రేట్‌గా ఉంచుతుంది.
చర్మం ఎరుపును తగ్గిస్తుంది – రైస్ వాటర్ చర్మంపై ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది.
పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది- బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు పిగ్మెంటేషన్‌ను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.
మొటిమలను తగ్గిస్తుంది- రైస్ వాటర్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మొటిమలను తగ్గిస్తుంది .
సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది- సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో బియ్యం నీరు సహాయపడుతుంది.
బియ్యం నీటిని ఎలా తయారు చేయాలి ? ఎలా ఉపయోగించాలి ?
బియ్యం నీరు తయారు చేయడం చాలా సులభం. మీరు బియ్యం కడిగిన తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకోండి. ఈ నీటిని మీ ముఖానికి టోనర్‌గా ఉపయోగించవచ్చు. కావాలంటే ఈ నీటిని రోజ్ వాటర్ మిక్స్ చేసి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.
ముఖానికి బియ్యం నీటిని ఎలా అప్లై చేయాలి ?
ముందుగా మీ ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ సహాయంతో మీ ముఖంపై బియ్యం నీటిని అప్లై చేయండి. 10- 15 నిమిషాలు అలాగే వదిలేయండి.
తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
Also Read: 7 రోజులు ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
బియ్యం నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి 2-3 రోజులు ఉపయోగించవచ్చు.
బియ్యం నీళ్లతో మీకు ఏదైనా అలెర్జీ ఉంటే, దానిని ఉపయోగించకండి.
మీరు ఏవైనా చర్మ సమస్యలతో బాధపడుతుంటే, రైస్ వాటర్ ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.
జుట్టుకు కూడా బియ్యం నీటిని వాడవచ్చు. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది .
మీరు ఫేస్ మాస్క్‌లను తయారు చేయడానికి బియ్యం నీటిని కూడా ఉపయోగించవచ్చు.