E-Paper
Advertisement

ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
Advertisement

Saggubiyyam Vadiyalu: మన తెలుగు వంటకాలలో వడియాలకు.. ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పప్పు చారు, సాంబార్, రసం లేదా పెరుగన్నంలో నంచుకోవడానికి సగ్గుబియ్యం వడియాలు వేసుకుంటే.. ఆ భోజనమే వేరే లెవల్‌లోకి వెళ్లిపోతుంది. బయట కొనే.. వాటికంటే ఇంట్లోనే ప్రేమగా, శుభ్రంగా చేసుకునే.. వడియాల రుచి అమోఘంగా ఉంటుంది. సరైన కొలతలు, చిన్న చిన్న మెళకువలు పాటిస్తే ఎవరైనా ఈజీగా తెల్లగా, క్రిస్పీగా వచ్చే సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

లావు సగ్గుబియ్యం: 1 కప్పు

Advertisement

నీళ్లు: 5 నుంచి 6 కప్పులు

పచ్చిమిర్చి: 3 లేదా 4

Advertisement

జీలకర్ర: 1 టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు: కొద్దిగా

నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని మునిగేంత వరకు నీళ్లు పోసి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన సగ్గుబియ్యం మెత్తగా, ఉబ్బినట్టుగా మారతాయి. దీనివల్ల ఉడికించేటప్పుడు త్వరగా మగ్గి, వడియాలు చక్కగా వస్తాయి. అడుగు మందంగా ఉన్న పాత్ర లేదా గిన్నె తీసుకుని అందులో.. నానబెట్టిన సగ్గుబియ్యం, కొలత ప్రకారం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండటం చాలా అవసరం. నీళ్లు కాస్త వేడయ్యాక రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.

Also Read: సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!

2.సగ్గుబియ్యం పారదర్శకంగా మారి, మిశ్రమం చిక్కబడే.. వరకు ఉడికించాలి. గరిటెతో తీసి చూస్తే జారుగా కాకుండా.. కొంచెం మందంగా పడేలా ఉండాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. మీకు నచ్చితే.. చివరగా సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే వడియాలు పెట్టడం మొదలుపెట్టాలి.

4. మండుతున్న ఎండలో శుభ్రమైన ప్లాస్టిక్ షీట్ లేదా కాటన్ క్లాత్ పరచాలి. గరిటె లేదా స్పూన్‌తో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ గుండ్రని వడియాలుగా వేయాలి. మరీ పలుచగా కాకుండా.. మరీ మందంగా కాకుండా మీడియం సైజులో వేస్తే బాగా ఎండుతాయి. వడియాలను రోజంతా బాగా ఎండనివ్వాలి. సాయంత్రానికి ఇవి కాస్త గట్టిపడతాయి. అప్పుడు షీట్ నుండి మెల్లగా తీసి, మరో రోజు కూడా పూర్తిగా ఎండబెట్టాలి. తేమ ఏమాత్రం లేకుండా పూర్తిగా ఎండిన తర్వాతే గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏడాది పొడవునా తాజాగా ఉంటాయి.

కారం కోసం పచ్చిమిర్చికి బదులుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వాడితే.. లుక్ మరింత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వడియాలు వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి, అప్పుడే వడియాలు చక్కగా పొంగుతాయి. నూనెలో వేసిన వెంటనే తీసేస్తే తెల్లగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ సగ్గుబియ్యం వడియాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి!

Related News

బరువు తగ్గించి,షుగర్‌ కంట్రోల్ చేసే కమ్మని కొర్రల కిచిడీ!

సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!

పొట్లకాయ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది!

నెల రోజుల పాటు నిల్వ ఉండే..గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి!

స్ట్రీట్ స్టైల్ మసాలా పాస్తా..ఇలా చేస్తే అదిరిపోతుంది!

భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న యాంటీ-ఏజింగ్ విప్లవం..మరీ ఎందుకింత పిచ్చి!

Big Stories

Advertisement
×