E-Paper
Advertisement

బరువు తగ్గించి,షుగర్‌ కంట్రోల్ చేసే కమ్మని కొర్రల కిచిడీ!

బరువు తగ్గించి,షుగర్‌ కంట్రోల్ చేసే కమ్మని కొర్రల కిచిడీ!
Advertisement

Korrala Khichdi Recipe: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారి సంఖ్య బాగా పెరిగింది. తెల్ల బియ్యానికి బదులుగా మన పాత కాలపు చిరుధాన్యాలను డైట్‌లో చేర్చుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అందులో ..ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొర్రల కిచిడీ గురించి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ వంటకం బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదా రాత్రి డిన్నర్‌లోకి పర్ఫెక్ట్ ఆప్షన్. తక్కువ సమయంలో.. ఇంట్లో ఉండే కూరగాయలతో ఎంతో ఈజీగా ఈ హెల్తీ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్రల కిచిడీ:

సాధారణంగా చిరుధాన్యాలతో వంటలు అంటే చాలామంది రుచిగా ఉండవేమో అని అనుకుంటారు. కానీ, కొర్రలు, పెసరపప్పు, తాజా కూరగాయలు కలిపి చేసే.. ఈ కిచిడీ తింటే మాత్రం ఆ అభిప్రాయం పూర్తిగా మారి పోతుంది. ఇది కేవలం కడుపు నింపే ఫుడ్ మాత్రమే కాదు, శరీరానికి కావలసిన పూర్తి పోషకాలను అందించే ఒక కంప్లీట్ మీల్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు:

Advertisement

కొర్రలు : 1 కప్పు

పెసరపప్పు: అర కప్పు

Advertisement

సన్నగా తరిగిన ఉల్లిపాయ: 1 (పెద్దది)

టమాటా ముక్కలు: 1 కప్పు

క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ ముక్కలు: 1 కప్పు

పచ్చిమిర్చి: 2 లేదా 3

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్

నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు

పోపు దినుసులు: జీలకర్ర (1 టీస్పూన్), బిర్యానీ ఆకు (1), దాల్చిన చెక్క (చిన్న ముక్క), లవంగాలు (3), కరివేపాకు (రెండు రెమ్మలు)

పసుపు: అర టీస్పూన్

ధనియాల పొడి: 1 టీస్పూన్

గరం మసాలా లేదా సాంబార్ పొడి: అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర: కొద్దిగా

నీళ్లు: 4.5 నుంచి 5 కప్పులు

తయారు చేసే విధానం:

1. ముందుగా కొర్రలను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, కనీసం 4 నుంచి 5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల కొర్రలు త్వరగా ఉడకడమే కాకుండా, ఈజీగా జీర్ణమవుతాయి. పెసరపప్పును వండటానికి అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే సరి పోతుంది.

2. స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత కరి వేపాకు, పచ్చి మిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపండి.

3. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటో, క్యారెట్, బీన్స్, బఠానీ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి కూరగాయలకు పట్టేలా బాగా కలపాలి.

4. ఇప్పుడు నానబెట్టిన కొర్రలు, పెసరపప్పు నుండి నీళ్లు వంపేసి కుక్కర్‌లో వేయండి. మసాలాలు వీటికి పట్టేలా ఒక నిమిషం పాటు నెమ్మదిగా వేయించాలి. ఆ తర్వాత 1 కప్పు కొర్రలు, అర కప్పు పప్పుకు కలిపి సుమారు 4.5 నుండి 5 కప్పుల నీళ్లు పోయాలి. (కిచిడీ కాస్త జారుగా కావాలంటే 5 కప్పుల నీళ్లు పోసుకోవచ్చు). ఉప్పు సరి చూసుకుని కుక్కర్ మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

5. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, పైన సన్నగా తరిగిన కొత్తి మీర, ఒక చెంచా నెయ్యి వేసి మెల్లగా కలపండి. అంతే! వేడి వేడి, కమ్మని కొర్రల కిచిడీ రెడీ. దీనిని పెరుగు రైతా, నిమ్మకాయ పచ్చడి లేదా అప్పడాలతో కలిపి తింటే ఆ రుచే వేరు.

కొర్రలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది బెస్ట్ ఫుడ్. ఇందులో ఉండే అధిక ఫైబర్ కడుపు నిండిన ఫీల్ కలిగించి, బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఈ కొర్రల కిచిడీ అద్భుతంగా పని చేస్తుంది.

Tags

Related News

సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!

పొట్లకాయ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది!

నెల రోజుల పాటు నిల్వ ఉండే..గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి!

స్ట్రీట్ స్టైల్ మసాలా పాస్తా..ఇలా చేస్తే అదిరిపోతుంది!

భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న యాంటీ-ఏజింగ్ విప్లవం..మరీ ఎందుకింత పిచ్చి!

గుమ్మడి వడియాలు..పక్కా కొలతలతో ఇలా చేయండి!

Big Stories

Advertisement
×