E-Paper
Advertisement

20 ఏళ్లుగా తొక్కిపెట్టిన అమ్మాయి మిస్సింగ్ కేసు.. కోర్టులో బయటపడ్డ భయంకర నిజాలు… థ్రిల్లింగ్ సిరీస్

20 ఏళ్లుగా తొక్కిపెట్టిన అమ్మాయి మిస్సింగ్ కేసు.. కోర్టులో బయటపడ్డ భయంకర నిజాలు… థ్రిల్లింగ్ సిరీస్
Advertisement

Malayalam Crime Thriller on OTT: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటేనే ఓటీటీ ఆడియన్స్‌లో ఒక రకమైన నమ్మకం ఉంటుంది. అక్కడ అనవసరపు బిల్డప్‌లు, భారీ ఫైట్లు ఉండవు.. కథ మొదలైన పది నిమిషాలకే మనల్ని కుర్చీ అంచున కూర్చోబెట్టే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే మాత్రం పక్కాగా ఉంటుంది. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, దాన్ని పట్టుకుని చివరి వరకు వాళ్లు నడిపించే విధానం నిజంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అచ్చం అదే తరహాలో, 20 ఏళ్లుగా చీకట్లో తొక్కిపెట్టిన ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా ‘సత్యమేవ’ (Sathyameva) నేటి నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. ‘కన్నూర్ స్క్వాడ్’ ఫేమ్ రోనీ డేవిడ్ రాజ్ లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్‌కు దీపు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. చావు బతుకుల మధ్య ఉన్న ఒక తండ్రి ఆఖరి కోరికను తీర్చడానికి, పరువు పోగొట్టుకున్న ఓ లాయర్ చేసిన న్యాయ పోరాటాన్ని ఈ సిరీస్‌లో కళ్లకు కట్టారు.

కథ ఏమిటంటే ?

ఈ కథ లాయర్ రాజారామ్ చుట్టూ తిరుగుతుంది. తప్పు చేయని ఒక అమాయకుడిని కోర్టులో కాపాడలేకపోయాననే బాధతో కుమిలిపోతున్న రాజారామ్ మానసికంగా ఎంతో కుంగిపోతాడు. దీంతో అతని కెరీర్ కూడా దెబ్బతింటుంది. న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లి, తన వృత్తికి దూరంగా ఉంటున్న సమయంలో, విజయన్ అనే ఒక వృద్ధుడు రాజారామ్ వద్దకు వస్తాడు. ఇరవై ఏళ్ల క్రితం అదృశ్యమైన తన కూతురిని ఎలాగైనా వెతికి పెట్టమని ఆ తండ్రి చేసే చివరి విజ్ఞప్తి రాజారామ్ మనసును కదిలిస్తుంది. ఆ తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న రాజారామ్, మళ్లీ నల్లకోటు వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతాడు.

Advertisement

ఇక ఈ మిస్సింగ్ కేసును ఒక హెబియస్ కార్పస్ పిటిషన్‌గా మార్చి, తనదైన శైలిలో విచారణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఒక అనాథాశ్రమం, ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన పాత పోలీస్ ఫైల్ అతని కంటపడతాయి. ఆ ఆధారాలను వెంబడిస్తూ వెళ్లిన రాజారామ్‌కు, ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన వెనుక సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తుల హస్తం ఉందనే చేదు నిజం తెలుస్తుంది. నిజాన్ని ఎప్పటికీ బయటకు రానివ్వకూడదని ప్రత్యర్థులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా, రాజారామ్ వెనకడుగు వేయడు. కోర్టు లోపల భయంకరమైన రహస్యాలను  బయటపెడతాడు. ఆ మిస్టరీ ఏమిటి ? ఆ పెద్ద తలకాయలను ఎదురించి రాజారామ్ ఆ కుటుంబానికి న్యాయం చేశాడా? కోర్టులో నిజాన్ని ఎలా నిరూపించాడు? అనేది చాలా ఉత్కంఠగా సాగుతుంది. ఎమోషనల్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది.

జీ5లో స్ట్రీమింగ్

‘సత్యమేవ’ (Sathyameva) మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ZEE5 (జీ5) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో 2026 నవంబర్ 27న మొత్తం ఆరు ఎపిసోడ్‌లతో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీపు కరుణాకరన్ దర్శకత్వంలో రోనీ డేవిడ్ రాజ్ తో పాటు ఇందులో మీనాక్షి ఉన్నికృష్ణన్, సోహన్ సీను లాల్, రమ్య సురేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతానికి ఈ సిరీస్ కేవలం మలయాళం ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా విడుదల కాలేదు, కానీ తెలుగు ప్రేక్షకులు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ దీనిని చూడవచ్చు.

Advertisement

Read Also: తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన వస్తువు… చరిత్రనే మార్చే రహస్యం… ట్విస్టులతో మతిపోగొట్టే కామెడీ మిస్టరీ సిరీస్

Tags

Related News

డేటింగ్ యాప్ ఆఫీసులో సీక్రెట్ లవ్… ఓటీటీలోకి వచ్చిన క్రేజీ రొమాంటిక్ సిరీస్

కొత్తగా పెళ్లై కాలనీలోకి వచ్చిన జంట… రాత్రికి రాత్రే భార్య అదృశ్యం.. ఓటీటీలోకి ఆసక్తికరమైన థ్రిల్లర్

Friday OTT Releases : మూవీ లవర్స్ కు పునకాలే.. ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్స్ సినిమాలు..!

నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత్‌లో ఆ పాక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు బ్రేక్!

ఫేస్‌బుక్ రహస్యాలను లీక్ చేసిన మాజీ ఉద్యోగిని… టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన నిజ జీవిత థ్రిల్లర్ స్ట్రీమింగ్

ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న ఆదర్శ కుటుంబం!

భర్తలకు తెలియకుండా భార్యల రహస్య పార్టీలు… ఓటీటీలో సంచలన సిరీస్

Big Stories

Advertisement
×