E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!
Advertisement

Electric Two Wheeler Sales: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా 2026 పండుగ సీజన్‌ లో ఈవీ స్కూటర్లు, బైక్‌లకు భారీ డిమాండ్ కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు ఏకంగా 61.10 శాతం పెరిగాయి. 42 రోజుల పండుగ సీజన్‌ లో మొత్తం 3.31 లక్షల వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి.

3.31 లక్షల యూనిట్లకు చేరిన అమ్మకాలు

2026 అక్టోబర్ 11 నుంచి నవంబర్ 21 వరకు జరిగిన పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు 3,30,846 యూనిట్లకు చేరుకున్నాయి. 2025లో ఇదే సమయంలో 2,05,373 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఏడాదిలో అదనంగా 1,25,473 వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం టూ వీలర్ మార్కెట్‌తో పోలిస్తే ఈ పెరుగుదల చాలా ఎక్కువ. 2025 పండుగ సీజన్‌లో 41.60 లక్షల టూ వీలర్స్ రిజిస్టర్ కాగా, 2026లో ఆ సంఖ్య 43.13 లక్షలకు చేరింది. అంటే, మొత్తం మార్కెట్ వృద్ధి కేవలం 3.67 శాతంగా నమోదైంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ మాత్రం 61 శాతానికి పైగా వృద్ధిని సాధించింది.

మొత్తం అమ్మకాల్లో పెరిగిన ఈవీల వాటా

Advertisement

పండుగ సీజన్‌లో మొత్తం టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా భారీగా పెరిగింది. 2025లో ఈ వాటా 4.94 శాతంగా ఉండగా, 2026లో 7.67 శాతానికి చేరుకుంది. అంటే, ఏడాదిలో 2.73 శాతం పాయింట్ల పెరుగుదల కనిపించింది.  మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొత్తం టూ వీలర్స్ అమ్మకాల్లో అదనంగా నమోదైన 1.52 లక్షల యూనిట్లలో 82.19 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే కావడం విశేషం. పెట్రోల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కేవలం 0.69 శాతం మాత్రమే పెరిగాయి.

ఈవీ మార్కెట్లోనూ టూ వీలర్స్ దే హవా

2026 పండుగ సీజన్‌లో అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి 5,09,667 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాటా 64.91 శాతంగా ఉంది. అంటే, మొత్తం ఈవీ మార్కెట్లో ప్రతి మూడు వాహనాల్లో దాదాపు రెండు టూ వీలర్స్ కావడం విశేషం. ఇతర సెగ్మెంట్ల విషయానికి వస్తే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు 52,104 యూనిట్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ 1,20,330 యూనిట్లు, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ 6,387 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఈవీల వైపు మొగ్గు చూపుతున్న కొనుగోలుదారులు

Advertisement

గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్‌లో కీలక మార్పు కనిపిస్తోంది. 2024 పండుగ సీజన్‌లో 1.99 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, 2026 నాటికి ఆ సంఖ్య 3.31 లక్షలకు చేరింది. తక్కువ మెయింటెనెన్స్  ఖర్చులు, పెట్రోల్ ధరల భారం నుంచి ఉపశమనం, కొత్త మోడళ్ల రాక లాంటి అంశాలు ఈవీలపై ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాయి.

Read Also: లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

Tags

Related News

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

ఇన్విక్టోలో టయోటా మ్యాజిక్.. ఇక E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ తో పరుగులు!

మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!

నెక్సాన్ To అవినయ ఎక్స్.. టాటా నుంచి రాబోతున్న 5 క్రేజీ కార్లు!

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

తక్కువ బరువు, మంచి రేంజ్‌.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

Big Stories

Advertisement
×