Sattibabu Biryani Kondapur food safety raid: హైదరాబాదీలకి బిర్యానీ అంటే ఒక ఎమోషన్. అయితే మనం తినే బిర్యానీ ఎంత టేస్టీగా ఉందన్న విషయం పక్కన పెడితే.. తిన్నాక మనం సేప్‌గా ఉంటామో లేదో అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వివిధ రెస్టారెంట్లు, హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొండాపూర్‌లోని ఫేమస్ ‘సత్తిబాబు బిర్యానీ’సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ రైడ్‌లో సత్తిబాబు బిర్యానీ ఏకంగా 92 శాతం స్కోర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అంతా బాగున్నా అధికారులు కొన్ని చిన్న లోపాలను పట్టుకున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ ఐటీ హబ్ ఏరియా అయిన కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్న సత్తిబాబు బిర్యానీ అవుట్‌లెట్‌లో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ టీమ్ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం సైబరాబాద్ వ్యాప్తంగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాల మీద పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ అవుట్‌లెట్‌ను కూడా అధికారులు జల్లెడ పట్టారు. మొత్తం 92 మార్కులకు గానూ ఈ హోటల్ ఏకంగా 84 మార్కులు సాధించి సేఫ్టీలో బెస్ట్ అని నిరూపించుకుంది.
హోటల్‌లో మెచ్చుకోదగ్గ విషయాలు:
సాధారణంగా హైదరాబాద్‌లో ఫుడ్ రైడ్స్ జరిగాయంటే.. కుళ్లిన మాంసం, బొద్దింకలు బయటపడటం చూస్తుంటాం. కానీ సత్తిబాబు బిర్యానీలో సీన్ రివర్స్ అయింది. అక్కడ కిచెన్ స్టాఫ్ అందరూ హెయిర్ నెట్స్, గ్లోవ్స్, ఏప్రాన్లు వేసుకుని వంట చేస్తున్నారు. వంటకాల ఎక్స్‌పైరీ డేట్స్ కరెక్ట్‌గా.. మెయింటైన్ చేస్తున్నారు. హోటల్‌కు సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, వాటర్ టెస్టింగ్ రిపోర్టులు అన్నీ పక్కాగా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్‌ను వేరువేరుగా స్టోర్ చేయడం, మీట్‌ను నీట్‌గా కడిగి ప్యాక్ చేయడం వంటివి అధికారులను ఇంప్రెస్ చేశాయి.
అక్కడ దొరికిన ఆ రెండు తప్పులు ఇవే..
అంతా సూపర్బ్ గా ఉంది కదా అనుకునే లోపే అధికారులు రెండు ముఖ్యమైన లోపాలను నోటీస్ చేశారు. అధికారులు ఇన్‌స్పెక్షన్ చేస్తున్న టైమ్‌లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద మూతలు తెరిచి ఉన్నాయి. దాంతో అక్కడ కొన్ని ఈగలు వాలుతూ కనిపించాయి. ఇక రెండో తప్పు ఏంటంటే.. బిర్యానీలో వాడే నెయ్యి డబ్బాల మీద ప్రాపర్ లేబ్లింగ్ లేదు. అంటే అది ఎప్పుడు తయారైంది. ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనే వివరాలు సరిగ్గా లేవు.
అధికారుల సీరియస్ వార్నింగ్స్:
ఈ రెండు లోపాలను గుర్తించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హోటల్ యాజమాన్యానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు పెట్టాలని, ఈగలు ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇకపై హోటల్‌లోకి.. తెచ్చే నెయ్యి లేదా ఇతర పదార్థాల ప్యాకెట్ల మీద కచ్చితంగా లేబ్లింగ్ ఉండాలని, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని స్పష్టం చేశారు.
ఈ ఫుడ్ సేఫ్టీ అప్‌డేట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొండాపూర్ ఏరియాలోని సబ్‌వే లో కుళ్లిన లెట్యూస్ ఆకులు, స్పైస్ కిచెన్‌లో బొద్దింకలు దొరికిన నేపథ్యంలో.. సత్తిబాబు బిర్యానీ 92 శాతం స్కోర్ సాధించడం మంచి విషయమే. ఆ చిన్న తప్పులను కూడా సరిదిద్దుకుంటే ఈ హోటల్ బిర్యానీ లవర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది.