E-Paper
Advertisement

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!
Advertisement

Relationship Tips:పాస్ వర్డ్ …ఈ రోజుల్లో ప్రతి ఫోన్‌కి ఇది కామన్ అయిపోయింది.ఫోన్లలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకోవడం మంచిది కూడా.కానీ “నీ ఫోన్ పాస్‌వర్డ్ ఏంటి?” అని లైఫ్ పార్ట్నర్ అడిగితే.. “అది నా పర్సనల్ విషయం” అని ఎవరైనా అన్నారంటే మాత్రం గొడవలు మొదలైనట్టే.మరి నిజంగానే పాస్‌వర్డ్ చెప్పకపోవడం తప్పేనా? ఒకసారి చూద్దాం.

ఫోన్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోవడం తప్పు కాదు

ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఫోన్‌కి పాస్‌వర్డ్ పెట్టడం అసలు తప్పు కాదు.ఎందుకంటే ఫోన్‌లో బ్యాంక్ విషయాలు, విలువైన డేటా, ఆఫీస్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఫొటోలు.. ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయి.కాబట్టి అవి సేఫ్‌గా ఉండాలంటే పాస్‌వర్డ్ చాలా ముఖ్యం.

సమస్య పాస్‌వర్డ్‌లో కాదు.. దాచడంలో ఉంది

Advertisement

అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే.. ఫోన్‌కి పాస్‌వర్డ్ పెట్టుకున్నారని కాదు.ఆ పాస్‌వర్డ్‌ని ఎందుకు దాచిపెడుతున్నారని.ఫోన్‌ని వదలకుండా ఎప్పుడూ చేతిలో పట్టుకోవడం, ఎవరైనా వస్తే వెంటనే మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేయడం, ఏదైనా కాల్ వస్తే ఎవరికీ అనుమానం రాకుండా బయటికి వెళ్లి మాట్లాడడం, వచ్చిన మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయడం..ఇలా ఇవన్నీ అనుమానాస్పదంగా చేస్తే లైఫ్ పార్ట్నర్‌కి అనుమానం రావడం సహజం.

ప్రైవసీకి, సీక్రెసీలకు తేడా ఉంది

నిజానికి ప్రతి మనిషికి కొంచెం ప్రైవసీ కావాలి.దాన్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు కూడా.కానీ అదే ప్రైవసీ పేరుతో సీక్రెసీలు మెయింటైన్ చేస్తే మాత్రం ఆ బంధం బీటలు వారుతుంది.భార్య అయినా, భర్త అయినా.. తనకు తెలియకుండా ఏదో సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారు అన్న ఆలోచన వస్తే వాళ్లలో అనుమానపు బీజాలు మొలకెత్తడం ఖాయం.

సమస్య ఫోన్‌లో కాదు.. నమ్మకంలో ఉంటుంది

Advertisement

నిజానికి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే.. సమస్య అనేది ఫోన్‌లో ఉండదు.భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతేనే గొడవలు మొదలవుతాయి.ఇక ఈ ఫోన్ అనేది దానికి మరింత ఆజ్యం పోస్తుంది.కాబట్టి బంధంలో నమ్మకం చాలా ముఖ్యం.ఆ నమ్మకం ఉంటే పాస్‌వర్డ్ ఏది పెట్టుకున్నా పెద్ద సమస్య కాదు.

ఫోన్ చెక్ చేయడం పరిష్కారం కాదు

అయితే చాలామంది కోపంలో లైఫ్ పార్ట్నర్ సెల్ ఫోన్‌ని చెక్ చేస్తుంటారు.అలా చేస్తే మనకు కాస్త రిలీఫ్ దొరకవచ్చు.కానీ మనలో ఉన్న అనుమానాలు మాత్రం పూర్తిగా పోవు.ఒక్కరోజు ఫోన్ చూడడం అలవాటైతే.. అది మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.

మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి

సో.. భార్యాభర్తలు ఏ విషయమైనా తొందరపడకుండా కలిసి కూర్చొని ఓపికగా మాట్లాడుకోవాలి.ముఖ్యంగా అనుమానం వచ్చినప్పుడు గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి.అలా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా సమస్యలను మరింత జటిలం చేసుకుంటే.. బంధం మూడు నాళ్ల ముచ్చట అయ్యే ప్రమాదం ఉంటుంది.

నమ్మకం ఉంటే పాస్‌వర్డ్ పెద్ద సమస్య కాదు

సో.. ఫోన్‌కి పాస్‌వర్డ్ ఉండొచ్చు.కానీ అది మీ లైఫ్ పార్ట్నర్‌కి కూడా తెలిసి ఉంటే ఇద్దరి బంధం మరింత సాఫీగా సాగిపోతుంది.చివరగా చెప్పాలంటే.. పాస్‌వర్డ్ చెప్పకపోవడం అనేది తప్పు కాదు.కానీ ప్రైవసీ పేరుతో సీక్రెసీలు పెంచుకుంటే మాత్రం అది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం చాలా ముఖ్యం.

also read:భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

ఇకనైనా మీ ఫోన్ పాస్‌వర్డ్‌ల విషయంలో సీక్రెసీలకు దూరంగా ఉండి.. మీ మధ్య నమ్మకాన్ని మరింత పెంచుకుంటారు కదూ!

Tags

Related News

స్టైలిష్‌గా కనిపించేందుకు బ్రాండెడ్ డ్రెస్‌ అవసరం లేదు.. తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషన్ టిప్స్

“నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

పిల్లలు హైట్ పెరగడం లేదా? రోజూ ఈ 5 యోగాసనాలు వేయండి.. ఆగకుండా ఎత్తు పెరుగుతారు

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి

ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే

నమ్మకానికి మారుపేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టాల్లో తోడుగా నిలబడే స్నేహితులు

Big Stories

Advertisement
×