E-Paper
Advertisement

కిచెన్‌లో ఈ చిన్న తప్పులే.. నెలాఖరుకి పర్సు ఖాళీ చేస్తాయి!

కిచెన్‌లో ఈ చిన్న తప్పులే.. నెలాఖరుకి పర్సు ఖాళీ చేస్తాయి!
Advertisement

Kitchen Tips: వచ్చేది ఎలుకంత.. పోయేది ఏనుగంతా అనుకుంటూ చాలామంది తమ ఖర్చులను చూసి బావురుమంటుంటారు. వీటిలో అధిక శాతం ప్లానింగ్ లేకుండా పోయేవే. ముఖ్యంగా ఇంటి ఖర్చుల్లో ఎక్కువ శాతం కిచెన్ కే ఖర్చు అవుతుంది.రోజు వెజిటేబుల్స్ అని, పాలని, నూనెలని, గ్యాస్ అని ఏదో ఒకటి ఖర్చు అవుతూనే ఉంటుంది. నిజానికి ఇది చాలా చిన్నగా కనిపించినా నెలాఖరికి వచ్చేసరికి ఇదే చాంతాడంత లిస్ట్ కనిపిస్తుంది.

అయితే మన రోజువారి జీవితంలో కొన్ని కొన్ని మార్పులు, చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే ఈ లీకేజీని ఈజీగా అరికట్టవచ్చు.మరి కిచెన్ లీకేజీని అరికట్టే ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగానే వారానికి ప్లాన్ వేసుకోండి

Advertisement

మన ఇళ్లల్లో ఎక్కువ శాతం మొదటగా “ఈరోజు ఏం వండాలి?” అనే ప్రశ్నతోనే తెల్లారుతుంది.ఇక అప్పుడు ఇంట్లో గనక ఏం లేకపోతే వెంటనే బయటికి వెళ్లి కనిపించిన ప్రతీదీ పట్టుకొని వచ్చేస్తాం. వాటిలో చాలావరకు అవసరం లేనివి ఉంటాయి.

అలా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆదివారం రోజే వచ్చే వారానికి సరిపడా ఏ కూర, ఏం టిఫిన్ ఎలా చేయాలి అన్నది ఆలోచించుకుంటే బయట మనం చేసే షాపింగ్ చాలా సులభం అవుతుంది.

షాపింగ్‌కు వెళ్లే ముందు లిస్ట్ తప్పనిసరి

Advertisement

మనలో ఉన్న మరో బలహీనత ఏంటంటే డిస్కౌంట్. ఎక్కడైనా డిస్కౌంట్లు కనిపిస్తే చాలు అవసరం ఉన్నవి, లేనివి అన్ని కొనేసి బ్యాగులో పడేస్తాం.అలా కాకుండా షాపింగ్ కి వెళ్లే ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏం అవసరం, ఏం అవసరం లేదు అన్నది ఒక క్లారిటీ వస్తుంది.

దానివల్ల లిస్ట్ లో ఉన్నవి మాత్రమే కొంటే చాలావరకు లీకేజీని అరికట్టినట్టే.

నెలకు ఒకసారి కొనాల్సిన సరుకులు

ఇక బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు, చక్కెర, మసాలా పొడులు ఇలాంటివి నెలకు ఒకసారి కొనడం మంచిది.దీనివల్ల ఖర్చు కలసి వస్తుంది మరియు అస్తమానం షాపింగ్ చేసే పని ఉండదు.

“ఒకటి కొంటే ఒకటి ఫ్రీ” ట్రాప్‌లో పడొద్దు

ఇక చాలామందికున్న మరో బలహీనత ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న బోర్డు చూస్తే చాలు అవసరం లేకపోయినా వాటిని కొనేసి సగం రేట్ కి వచ్చిందని మురిసిపోతుంటాం. 50% డిస్కౌంట్ కి కొట్టేసామని సంబరపడిపోతుంటాం.

కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు మీకు అవసరం లేని వస్తువు కోసం మీరు మీ డబ్బులు వేస్ట్ చేశారని తెలీదు.ఇక వాటిని వాడక ముందే అవి పాడై పోతే మాత్రం మీరు సేవ్ చేయాలనుకున్న డబ్బే వేస్టేజ్ కిందికి వెళ్లిపోతుంది.అందుకే ఏం అవసరమో అదే కొంటే మన పర్సు భద్రంగా ఉంటుంది.

కూరగాయలు ఎక్కువగా కాదు… అవసరానికి మాత్రమే

కూరగాయలని ఒకేసారి కొనడం కంటే రెండు రోజులకోసారి సరిపడా కొనడం ఉత్తమం.ఎందుకంటే అస్తమానం ఎవరు తిరుగుతారని ఒకేసారి కొంటే మాత్రం రెండు రోజుల తర్వాత మిగతా కూరగాయలను చెత్తబుట్టలో పాడేయాల్సిందే.

మిగిలిన ఫుడ్‌ను స్మార్ట్‌గా వాడండి

ఇక చాలా మంది రాత్రి మిగిలిన అన్నం, కూరల్ని చెత్తబుట్టలో పడేస్తుంటారు.చెడిపోతే ఓకే. కానీ బాగుంటే వాటిని ఎంచక్కా ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, కర్డ్ రైస్ వంటి రెసిపీలు చేసుకొని టేస్టీగా తినొచ్చు.ఇక మిగిలిన కూరతో పరాటా, శాండ్విచ్ లేదా రోల్స్ చేసుకోవచ్చు కూడా.ఇలా చేస్తే ఫుడ్ వేస్ట్ కాదు మరియు డబ్బు కూడా సేవ్ అవుతుంది.

బ్రాండెడ్ అంటేనే బెస్ట్ అనుకోవద్దు

ఇక చాలామంది మేము ప్రతిదీ బ్రాండెడ్ వాడతాం అంటూ హెచ్చులకు పోతుంటారు.అలా చేస్తే మీ పర్సులకే చిల్లు పెట్టుకున్నట్టు.ఎందుకంటే చాలా మంచి లోకల్ బ్రాండ్లు కూడా తక్కువ రేట్లకి మార్కెట్లో దొరుకుతుంటాయి. సరిగ్గా చూసి పట్టుకోవడమే.ఒకసారి కొనేముందు వాటి ధర, క్వాలిటీని చెక్ చేసుకుంటే సరి.

ఫ్రిజ్‌ను సరిగ్గా వాడితే డబ్బు సేవ్

ఇక చాలామంది ఫ్రిజ్లో పెట్టిన చాలా వస్తువులు మర్చిపోతారు.అలా కాకుండా ఫ్రిజ్ ని సరిగ్గా వాడాల్సిన తీరులో వాడితే చాలా డబ్బుని సేవ్ చేసినట్టే.ఇక ఫ్రిడ్జ్ ని శుభ్రం చేసి వస్తువులను జాగ్రత్తగా పెడితే నీట్ గా ఉండి అందులో పెట్టిన ఫుడ్డు చెడిపోకుండా ఉంటుంది.

బయట ఫుడ్ ఆర్డర్లు తగ్గించండి

ఇక చాలామంది బద్ధకంతోనో, చేయాలన్న ఓపిక లేదనుకుంటూ బయట ఫుడ్ ని విపరీతంగా ఆర్డర్లు పెడుతుంటారు.దానివల్ల మీ పాకెట్ లీకేజీ దారుణంగా జరిగిపోతుంది.అలా కాకుండా కాస్త బద్ధకంగా ఫీల్ అవ్వకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకుంటే అటు టేస్టీకి టేస్టీ, ఇటు హెల్తీకి హెల్తీ.

వంట మొదలుపెట్టే ముందు అన్నీ సిద్ధం చేసుకోండి

ఇక చాలామంది చేసే మరో తప్పు ఏంటంటే గ్యాస్ వెలిగించాక చేయాల్సిన ఫుడ్ కోసం అన్ని వస్తువులను వెతుకుతుంటారు.అలా కాకుండా రెసిపీకి ఏమి కావాలో అవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని అందుబాటులో పెట్టుకుంటే గ్యాస్ చాలా ఆదా అవుతుంది.

ఖర్చుల లెక్క రాసుకుంటే లీకేజీ తెలుస్తుంది

ఇక అన్నింటికన్నా మించి మీరు కిచెన్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక లెక్క రాసుకోవడం ఉత్తమం.ఎందుకంటే జరుగుతున్న లీకేజీలు ఇలా తెలిసి మరోసారి ఆ లీకేజీలు జరగకుండా జాగ్రత్త పడతాం.

సో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కిచెన్ బడ్జెట్ కంట్రోల్ అంటే తక్కువ తినడం, అసలు తినకుండా ఉండటం కాదు. కాస్త తెలివిగా అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడం.

ALSO READ:వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!

మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మీ కిచెన్ బడ్జెట్ ని కంట్రోల్ లో పెట్టుకుంటారు కదా!

Tags

Related News

చూయింగ్ గమ్ నమిలితే క్యాన్సర్ తగ్గుతుందా? అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!

మీ గర్ల్‌ఫ్రెండ్ ఇగోతో విసిగిపోయారా.. ఈ 5 ట్రిక్స్‌తో మీ మన:శాంతి కాపాడుకోండి

లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్

ధృడమైన చేతులు, భుజాలు కావాలా? అప్పర్ బాడీ బలం పెంచుకోవడానికి ఈజీ డంబెల్ వ్యాయామాలు

Big Stories

Advertisement
×