E-Paper
Advertisement

మీ గర్ల్‌ఫ్రెండ్ ఇగోతో విసిగిపోయారా.. ఈ 5 ట్రిక్స్‌తో మీ మన:శాంతి కాపాడుకోండి

మీ గర్ల్‌ఫ్రెండ్ ఇగోతో విసిగిపోయారా.. ఈ 5 ట్రిక్స్‌తో మీ మన:శాంతి కాపాడుకోండి
Advertisement

Toxic Relation mental Health| మంచి ప్రేమ బంధం లేదా దాంపత్య జీవితానికి ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన చాలా ముఖ్యమైనవి. అయితే ఒక వ్యక్తి ఎప్పుడూ తన మాటే వినాలని కోరుకుంటే సమస్యలు మొదలవుతాయి. మీ పార్ట్‌నర్ (ప్రియురాలు లేదా భార్య) మీ భావాలను పట్టించుకోకుండా, తానే ఎప్పుడూ సరైందని భావిస్తే అది సంబంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితులు మానసిక ఒత్తిడి, ఆందోళనకు కారణమవుతాయి. అందుకే ముందుగా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం.

ఈగోఇస్టిక్ ప్రవర్తన అర్థం చేసుకోండి

మనోవిజ్ఞాన శాస్త్రం (సైకాలజీ) ప్రకారం.. నార్సిస్టిక్ (అహంకారం, ఎక్కువ ఈగో) లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ప్రశంసలు, గుర్తింపు కోరుకుంటారు. ఇతరుల నుంచి భావోద్వేగ స్పందన వచ్చినప్పుడు వారు తమకు ప్రాధాన్యం లభించినట్లు భావిస్తారు. వారి మాటలకు అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా మీరు మీ మానసిక శక్తిని కాపాడుకోవచ్చు.

కోపానికి, నార్సిసిజానికి తేడా తెలుసుకోండి

Advertisement

ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ నార్సిసిస్టిక్ ప్రవర్తన మాత్రం ఎప్పటికప్పుడు కనిపించే అలవాటు. అలాంటి వ్యక్తులు తమ తప్పును ఒప్పుకోరు. ప్రతి సమస్యకు ఇతరులనే బాధ్యులుగా చూపిస్తారు. ఎప్పుడూ ప్రశంసలు కోరుకుంటారు. ఇతరుల భావాలను పెద్దగా పట్టించుకోరు.

గ్యాస్‌లైటింగ్‌ గుర్తించండి

గ్యాస్‌లైటింగ్ అంటే మీ జ్ఞాపకశక్తి లేదా నిర్ణయాలను అనుమానించడం. మీరు చెప్పిన విషయాలను పూర్తిగా ఖండించడం, అలాంటిది జరగలేదని చెప్పడం వంటి ప్రవర్తన ఇందులో భాగం. ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవడం వల్ల మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.

వారితో ఎమోషనల్ అటాచ్‌మెంట్ తగ్గించండి

Advertisement

నార్సిసిస్టిక్ లక్షణాలు ఉన్న వ్యక్తులు మీ పట్ల మీరు ఆశించినంత ప్రేమ, సానుభూతి ఎప్పుడూ చూపకపోవచ్చు. ఈ విషయాన్ని అంగీకరిస్తే నిరాశ తగ్గుతుంది. మీ మానసిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు.

ట్రామా బాండింగ్‌కు దూరంగా ఉండండి

మన:శ్శాంతి లేని కొన్ని టాక్సిక్ సంబంధాల్లో ప్రేమ, అవమానం వరుసగా కొనసాగుతుంటాయి. ఈ పరిస్థితి భావోద్వేగ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. థెరపీ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.

వాదనలతో సమయం వృథా చేయవద్దు

నార్సిసిస్టిక్ వ్యక్తులతో వాదించడం చాలా సందర్భాల్లో ఉపయోగం ఉండదు. వారు సమస్యను పరిష్కరించడం కంటే గెలవడానికే ప్రయత్నిస్తారు. అందువల్ల ప్రశాంతంగా ఉండి, అవసరమైతే ఆ సంభాషణను ముగించడం బెస్ట్.

మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడే 5 ట్రిక్స్

భావోద్వేగాలకు అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండండి. మీకు అంగీకారమైన, అంగీకరించలేని ప్రవర్తనకు స్పష్టమైన హద్దులు పెట్టండి. ఇతరుల మాటలతో మీపై మీకు అనుమానం రానివ్వకండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా కౌన్సిలర్‌తో సంబంధాలు కొనసాగించండి. అలాగే వ్యాయామం, హాబీలు, విశ్రాంతి వంటి స్వీయ సంరక్షణకు సమయం కేటాయించండి.

Also Read: మీ పిల్లాడిలో తెలివితేటలు పెరగాలంటే.. ఖరీదైన స్కూల్ లేదా ట్యూషన్ కాదు.. ఇవి నేర్పించండి

మార్పు సాధ్యమేనా?

నార్సిసిస్టిక్ లక్షణాలు ఉన్న వ్యక్తి తన సమస్యను గుర్తించి, మారాలని నిర్ణయించుకుంటే మార్పు సాధ్యమవుతుంది. దీనికి థెరపీ సాయం కూడా అందుబాటులో ఉంది. అయితే వారిని బలవంతంగా మార్చలేరు. అందుకే ముందుగా మీ మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

Also Read: ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు.

Related News

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!

లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్

ధృడమైన చేతులు, భుజాలు కావాలా? అప్పర్ బాడీ బలం పెంచుకోవడానికి ఈజీ డంబెల్ వ్యాయామాలు

భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్?

రామాయణం కోసం మాంసాహారం మానేసిన రణ్‌బీర్ కపూర్.. నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ తింటే ఫిట్‌నెస్ ఉంటుందా?

కేర్ హెల్త్ వాళ్లకు పెద్ద షాక్.. ఇక క్యాష్‌లెస్ చికిత్స కట్!

Big Stories

Advertisement
×