BigTV English

Scarlet Fever : హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్.. మీ పిల్లలు జాగ్రత్త

Scarlet Fever : హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్.. మీ పిల్లలు జాగ్రత్త
scarlet fever in hyderabad
scarlet fever in hyderabad

Scarlet Fever in Hyderabad : నగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నపిల్లలతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. స్కార్లెట్ జ్వరంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. సరిగ్గా వార్షిక పరీక్షల సమయంలోనే ఈ జ్వరం రావడం.. ఇబ్బందికరంగా ఉంటోంది. గతంలోనూ ఈ వ్యాధి ఉన్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ స్కార్లెట్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొన్నిసార్లు ఇవి సాధారణ జ్వరం లక్షణాలేనని భావిస్తారు. కానీ.. వైద్యుడిని సంప్రదించకుండా సొంతం వైద్యం చేస్తే.. అది వికటించే ప్రమాదం లేకపోలేదు.


అసలేంటి ఈ స్కార్లెట్ ఫీవర్..

స్కార్లెట్ ఫీవర్. ఇది స్ట్రైప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ జ్వరం సోకిన పిల్లలు దగ్గినపుడు లేదా తుమ్మినపుడు ఆ తుంపర్లు పక్కన ఉన్న పిల్లలపై పడి.. తద్వారా వారు కూడా జ్వరం బారిన పడతారు. తుంపర్లు పడిన ప్లేస్ లో చేతులు పెట్టి.. వాటిని గొంతు, ముక్కు వద్ద తాకించినా ఇతరులకు సోకుతుంది. పిల్లల్లో ఏమాత్రం జ్వరం లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులకు చూపించండి. జ్వరం పూర్తిగా తగ్గేంత వరకూ పాఠశాలలకు పంపకండి.

Read More : దోమలు లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా..?


స్కార్లెట్ ఫీవర్ వచ్చే ముందు జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తాయని, ఇవి మామూలే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అది న్యూమోనియా, రుమాటిక్ ఫీవర్, తీవ్రమైన కీళ్లనొప్పులు, గుండె సమస్యకు దారితీస్తుంది. పిల్లలకు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే స్కూల్ కు పంపకపోవడం మంచిది. తరచూ చేతులను శుభ్రం చేస్తూ ఉండాలి.

స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు

102 డిగ్రీలతో హై ఫీవర్, ఉన్నట్టుండి గొంతునొప్పి రావడం

తలనొప్పి, వికారం, వాంతులు

కడుపులో నొప్పి రావడం, శరీరంపై అకారణంగా దద్దుర్లు ఏర్పడటం

నాలుక స్ట్రాబెర్రీ కలర్లోకి మారడం

గొంతు, నాలుకపై తెల్లటి పూత, ట్రాన్సిల్స్ ఎరుపురంగులో పెద్దవిగా కనిపించడం

హైదరాబాద్ లో ఉన్న చాలా స్కూళ్లు.. ఈ ఫీవర్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జ్వరంతో ఉన్న పిల్లల్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలని, పాఠశాలలకు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ జ్వరం కనిపిస్తుందని, కాబట్టి పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.

Tags

Related News

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×