BigTV English

Deepika Padukone: ఎయిర్‌పోర్ట్‌లో బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. రణవీర్ ఎలా కాపాడాడో చూడండి

Deepika Padukone: ఎయిర్‌పోర్ట్‌లో బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. రణవీర్ ఎలా కాపాడాడో చూడండి

Deepika Padukone and Ranveer Singh news


Deepika Padukone and Ranveer Singh news(Bollywood celebrity news): స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్‌లో గత కొంత కాలం నుంచి టాప్ మోస్ట్ నటిగా కొనసాగుతోంది. పలు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ బ్యూటీ 2018లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది.

ఇక ఇన్నాళ్లకు ఈ ముద్దుగుమ్మ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపికా గర్భవతి అనే వార్తలు ఎప్పట్నుంచో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిని నిజం చేస్తూ దీపికా పదుకొనే తాజాగా తన ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది.


తన గర్భాన్ని తెలియజేస్తూనే.. 2024 సెప్టెంబర్ నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. అంతేకాకుండా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. దీంతో దీపికా పెట్టిన పోస్ట్‌ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. లైక్స్, కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

READ MORE: నేను తల్లిని కాబోతున్నానోచ్.. ఏ మంతో చెప్పేసిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

ఇంతటి శుభవార్త చెప్పిన దీపికాకు సినీ సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వార్తతో ఫుల్ హ్యాపీలో ఉన్న అభిమానులకి మరో సర్ప్రైజ్ అందించారు రణవీర్, దీపికా జంట. తాజాగా జామ్‌నగర్ విమానాశ్రయంలో ఈ లవ్ కపుల్ కనిపించడంతో ఎయిర్‌పోర్ట్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది.

త్వరలో తల్లిందండ్రులు కాబోతున్న రణవీర్, దీపికా పదుకొనే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ముందు జరిగిన వేడుకకు వచ్చినపుడు ఈ జంట వైట్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేశారు. అక్కడ ఈ జంటను చూసేందుకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ విపరీతంగా చేరారు.

ఆ సమయంలో రణవీర్.. దీపికా చేతిని పట్టుకుని ఆమెను తమ కారు వద్దకు తీసుకువెళ్లేందుకు సహాయం చేయడం చూడవచ్చు. అక్కడ విపరీతమైన జనాల నుండి దీపికను తన భర్త రణవీర్ ఎలా కాపాడాడో వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

READ MORE: ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ఇకపోతే దీపికా పదుకొనే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ మూవీ చేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో ప్రభాస్‌కు జోడీగా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇందులో భారీ తారగణం నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి నటీ నటులు భాగం కాబోతున్నారు.

Related News

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Big Stories

×