Mobile Phone: ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లలోనే గడుపుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్లు వాడటం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా చేతుల్లో మొబైల్ ఫోన్‌లను పట్టుకుని జనం కనిపింటారు. ఇది మాత్రమే కాదు మొబైల్ స్క్రీన్‌ను స్క్రోల్ చేయడంతోనే రోజును ప్రారంభిస్తుంటారు. కానీ మొబైల్ ఫోన్‌లను అధికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హానికరం.
ఉదయం పూట మొబైల్ ఫోన్ వాడేవారిలో మీరు కూడా ఒకరైతే, అది మీకు ఎంత హానికరమో ముందుగా తెలుసుకోండి. ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తలనొప్పి:
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తే, అది మీ శరీరంపై తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇందులో ముఖ్యమైనది జీవక్రియ మందగించడం, తలనొప్పి పెరుగడం. తరుచుగా ఫోన్ వాడటం వల్ల తలనొప్పి కూడా పెరుగుతుంది.
ఒత్తిడిని పెంచుతుంది:
ఉదయాన్నే తమ మొబైల్ ఫోన్‌ని చెక్ చేసేవారిలో మీరు కూడా ఒకరయితే ఇది మీ ఒత్తిడిని పెంచుతుందని గమనించండి. అందుకే వీలైనంతవరకు ఉదయం పూట ఫోన్ వాడకుండా ఉండటం మంచిది.
మెదడు పనితీరు ప్రభావితం అవుతుంది:
నిద్రలేచిన వెంటనే మీ ఫోన్‌ని చెక్ చేయడం వలన మీ అభిజ్ఞా పనితీరుకు ఆటంకం కలుగుతుంది. అంతే కాకుండా ఇది మీ చురుకుదనంపై ప్రభావం చూపుతుంది. మెదడు పనితీరుపై కూడా ఫోన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
కళ్లపై ఒత్తిడి ఉంటుంది:
ప్రకాశవంతంగా ఉన్న స్క్రీన్‌ని ఎక్కువసేపు చూస్తూ ఉండటం వల్ల మీ కళ్లపై ఒత్తిడిని కలుగుతుంది . దీని కారణంగా మీరు అసౌకర్యం, తలనొప్పి, కళ్ల వాపును అనుభవిస్తారు. ఇది మీ కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
Also Read: కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి వాడారంటే.. గ్లోయింగ్ స్కిన్
జీవక్రియ మందగిస్తుంది:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెల్ ఫోన్ల నుండి వెలువడే విద్యుత్ , అయస్కాంత క్షేత్రాలు మీ జీవక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. ఆ EMFలు తలనొప్పికి కారణమవుతాయి. అంతే కాకుండా మీ జీవక్రియను ప్రభావితం చేస్తాయి.