Thammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాతలో తమ్మారెడ్డి భరద్వాజ్ ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తమ్మారెడ్డి ప్రస్తుతం యూట్యూబ్ కు అంకితమయ్యాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చిన.. దానిపై యూట్యూబ్ లో తన ఛానెల్ లో తన అభిప్రాయాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా, నిసంకోచంగా చెప్పుకొస్తాడు. అక్కడ ఉన్నది స్టార్స్ నా.. ? పొలిటిషయన్స్ నా.. ? అనేది అస్సలు పట్టించుకోడు.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం అల్లు అర్జున్ కేసు. డిసెంబర్ 4 న పుష్ప 2 బెన్ ఫిట్ షో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ కు తీవ్రగాయాలవ్వడంతో హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నాడు. ఆమె మరణానికి కారణం అల్లు అర్జున్ రావడమే అని.. పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు.
పోలీసుల పర్మిషన్ లేకుండా థియేటర్ కు వెళ్లడం బన్నీ చేసిన మొదటి తప్పు అయితే.. బయట మహిళ చనిపోయిందని తెలిసి కూడా సినిమా చూసి క్యాజువల్ గా ఏం జరగలేదు అన్నట్లు బయటకు రావడం రెండో తప్పు. ఈ రెండు తప్పులు తరువాత బన్నీ ఎన్ని చేసినా.. పైకి కనిపించేవి మాత్రం ఇవే. ఇక ఇప్పటికే బన్నీని రెండుసార్లు పోలీసులు విచారించారు. ఈ కేసు ఇప్పుడప్పుడే తేవిలెలా కనిపించడం లేదు.
Amardeep-Tejaswini: పెళ్లి తరువాత మేము హ్యాపీగా లేము.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ అమర్
పోనీ, విచారణ అనంతరం బన్నీ సైలెంట్ గా ఉన్నాడా.. ? అంటే.. చక్కగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి.. తనను తాను కవర్ చేసుకొనే విధంగా ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని ఆడాడు. అలా బన్నీ ఈగో.. పోలీసుల వరకు చేరింది. ఇక పోలీసులు ఊరుకుంటారా.. ? ఇంకోసారి విచారణకు రమ్మన్నారు. ఇలా చేయడంతో ప్రభుత్వం బన్నీపై మండిపడింది. బెన్ ఫిట్ షోస్ ను క్యానిస్ల చేసింది. దీంతో ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతుంది అనే భయంతో ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయం గురించి ఎవరు మాట్లాడలేదని , ఇండస్ట్రీలో సమస్యల గురించి మాత్రమే మాట్లాడారని టాక్.
ఇక తాజాగా ఈ భేటీపై తమ్మారెడ్డి ఫైర్ అయ్యాడు. కొంతమంది సినిమా వాళ్ళు తలదించుకునేలా చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకడి ఈగో వలన ఇదంతా జరిగిందని, ఆ ఈగో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందని అన్నాడు. ” ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తలవంచుకొని నిలబడాల్సిన అవసరం ఏముంది. ఒక మనిషి కోసం.. ఆ మనిషి సొంతంగా చేశాడా.. ? పక్కన వాళ్ళతో కలిసి చేశాడా..? అనేది తెలియదు. తప్పు అయితే జరిగింది.
Sravanthi Chokarapu: బ్యాక్ చూపిస్తూ బెంబేలేత్తిస్తున్న హాట్ యాంకర్.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే
మర్డర్ ఆయన చేశాడు అని నేను అనడం లేదు. కానీ, ఆయన రోడ్ షో చేయడం, వెళ్ళాకా అలా చేసి తెలియకుండా బాధ్యుడు అయ్యాడు. దానికి బన్నీ ప్రేరేపితమై చేశాడా.. ? సొంతంగా చేశాడా.. ? నాకు తెలియదు. ఏదైనా కానీ తప్పు తప్పే. ఇక ఆ తప్పు జరిగాకా దాన్ని కవర్ చేయడానికి అబద్దాలు ఆడడం. ఇదంతా జరగడం వలన ఇండస్ట్రీకి.. ప్రభుత్వానికి ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. వీళ్లు మాట్లాడేది వీళ్లు మాట్లాడుతున్నారు. వాళ్లు మాట్లాడేది వాళ్లు మాట్లాడుతున్నారు.
అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలు అందరూ అక్కడకి వెళ్లి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కాంప్రమైజ్ అంటామో.. లేక తలవంపులు అంటామో నాకు తెలియదు. ఒక మనిషి కోసం.. ఆ మనిషి ఈగో కోసం ఇంతమంది తలలు వంచాల్సి వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి తమ్మారెడ్డి వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.