Fake Call to 108: ప్రాణప్రాయ స్థితిలో కుయ్.. కుయ్ అంటూ సైరన్ మోగిస్తూ, ప్రాణాలను రక్షించే 108 వాహనం గురించి తెలియని వారుండరు. జస్ట్ అలా 108 నెంబర్ టైప్ చేసి ఫ్రీగా కాల్ చేసుకొని ఉచిత సహాయం పొందవచ్చు. కానీ ఓ యువకుడు 108 ను మరో రీతిలో ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కానీ, ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్స్ సదరు యువకుడిపై ఫైర్ అవుతున్నారు.
ఏవైనా ప్రమాదాల సమయంలో, అనారోగ్య పరిస్థితుల్లో అందరికీ గుర్తొచ్చే వాహనం 108 వాహనం. జస్ట్ అలా ఫోన్ చేసి మన వివరాలు తెలిపితే చాలు, నిమిషాల వ్యవధిలో మన ముందు ప్రత్యక్షమవుతుంది ఈ వాహనం. ఈ వాహనంతో పాటు, 108 సిబ్బంది అందించే సేవలకు ప్రజలు జేజేలు పలుకుతారు. ఎవరూ లేని సమయంలో కూడా, ప్రమాదం జరిగిందని సమాచారం తెలిస్తే చాలు, 24 గంటలు ఈ వాహనం ద్వార మనం సేవలు పొందవచ్చు. ఇలాంటి ఉత్తమ సేవలు అందించే 108 వాహనానికి గతంలో ఆకతాయిల కాల్స్ వేధించేవి.
రాను రాను ఆకతాయిల కాల్స్ తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. కానీ తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు 108 నెంబర్ కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ ఆధారంగా 108 సిబ్బంది హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. ఇక పేషెంట్ రావడమే తరువాయి.
108 వాహనం సిద్దంగా ఉంది. అప్పుడే షాక్ తిన్నారు 108 సిబ్బంది. పేషెంట్ నేరుగా జీన్స్ పాయింట్ ధరించి, బాగా ఇన్ సెట్ వేశాడు. నవ్వుతున్నాడు, మాటలు గట్టిగా మాట్లాడుతున్నాడు ఆ పేషెంట్. ఖంగుతిన్న 108 సిబ్బంది పేషెంట్ ఎక్కడా అంటూ అడిగారు. నేనే పేషెంట్ అంటూ ఆ టిప్ టాప్ గా తయారైన యువకుడి సమాధానం. పదండి పదండి అంటూ ఆ యువకుడు హంగామా చేశాడు. అప్పుడు 108 సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీకు తగునా.. ప్రాణాపాయ స్థితిలో సంజీవనిలా ఉపయోగపడే 108 వాహనం పట్ల ఇదేనా మీ వైఖరి అంటూ ప్రశ్నించారు.
ఆరోగ్యం బాగున్నా, అనవసరంగా ఇలా ఫోన్లు చేసి గ్రామానికి రప్పించడం ఎంతవరకు సమంజసమని 108 సిబ్బంది నిలదీశారు. ఆ సమయంలో కూడా పేషెంట్ కాని పేషెంట్ చిరునవ్వులు చిందిస్తూ, కాళ్లు లాగుతున్నాయని చెప్పడం విశేషం. ఇలా ఫేక్ కాల్ చేసిన సమయంలో, వాస్తవంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే 108 అక్కడికి వెళ్లి ప్రాణాలను రక్షించేదని, ఇలా ఎవరైనా చేస్తారా అంటూ గ్రామస్తులు ఆ యువకుడిని నిలదీశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కాగా, ఆపద్బాంధవుడిలా ఉపయోగపడే 108 వాహనంను సరదాగా యువకుడు ఫోన్ చేసి రప్పించడంపై, నెటిజన్స్ తెగ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.
అంబులెన్స్ డ్రైవర్ కు షాక్ ఇచ్చిన వ్యక్తి
ఊరుకు వెళ్లేందుకు 108కి కాల్
టిప్ టాప్ గా తయారై అంబులెన్స్ కి ఫోన్ చేయడంతో అవాక్కయిన డ్రైవర్ pic.twitter.com/rOxkrrccps
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2024