Tips For Skin Tan Removal: ప్రస్తుతం చాలా మంది ఆయిలీ స్కిన్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్కిన్ ట్యానింగ్‌ను తొలగించి డార్క్ స్కిన్‌కి గ్లో తీసుకురావడానికి కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్కిన్‌పై టానింగ్‌ను తొలగించడానికి కొబ్బరి నూనెతో తయారు చేసిన కొన్ని రకాల హోం రెమెడీస్ వాడితే మంచి ఫలితం ఉంటుంది.
చర్మం రంగు మెరుగుపడుతుంది:
మీ స్కిన్ డల్‌గా నల్లగా మారినట్లయితే.. చర్మంపై జిడ్డు తొలగించడానికి కొబ్బరి నూనెరు వాడాలి. మీ ముఖ ఛాయను మెరుగుపరచాలనుకుంటే, కొబ్బరి నూనె యొక్క ఈ రెమెడీ మీకు సహాయపడుతుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె యొక్క ఈ రెమెడీ మీ టానింగ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా మీ ముఖానికి మెరుపును తెస్తుంది.
రోజువారీ స్కిన్ కేర్ రొటీన్‌ని పాటించిన తర్వాత కూడా స్కిన్ ట్యాన్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై పేరుకుపోయిన మురికితో పాటు .. సూర్యుని హానికరమైన కిరణాలకు గురికావడం వల్ల చర్మం అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి వారికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే సహజమైన డీ-ట్యానింగ్ లక్షణాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు నల్లగా మారిన చర్మం రంగును తిరిగి తెల్లగా మరుస్తుంది.
కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి:
శీతాకాలంలో చాలా మంది గంటల తరబడి ఎండలో కూర్చుంటారు. దీని వల్ల వారి చర్మం రంగు మారుతూ ఉంటుంది. ఇలా రంగు మారిన స్కిన్ తిరిగి మునుపటి రంగులోకి మారాలంటే చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో స్కిన్ టానింగ్ సమస్య నుండి ఈజీగా బయటపడటానికి.. కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయండి. ఇందుకోసం మీ అరచేతిపై కొన్ని చుక్కల కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను తీసుకుని చర్మాన్ని సుమారు 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె , నిమ్మరసం:
కొబ్బరి నూనె, నిమ్మరసంతో తయారు చేసిన హోం రెమెడీస్ రంగు మారిన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ రెమెడీ టానింగ్ నుండి బయటపడేలా చేస్తుంది. కొబ్బరి నూనె ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెమెడీ తయారు చేయడానికి.. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో 4 నుండి 5 చుక్కల నిమ్మరసం కలపండి . తర్వాత దీనిని చర్మంపై 15 నిమిషాలు అప్లై చేయండి. నిర్ణీత సమయం తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఈ రెమెడీని రిపీట్ చేయండి.
Also Read: ఇలా చేశారంటే.. తెల్లజుట్టు రమ్మన్నా రాదు
కొబ్బరి నూనె , చక్కెర స్క్రబ్:
కొబ్బరి నూనె , పంచదారతో చేసిన స్క్రబ్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం రెమెడీ వాడటం కోసం 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి స్కిన్ పై అప్లై చేయండి. దీనిని 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా తరుచుగా చేయడం ద్వారా మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. అంతే కాకుండా మీ రంగు మారిన స్కిన్ కూడా తిరిగి తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.