BigTV English
Advertisement

Beauty Tips For Skin: చక్కెరతో ఇలా చేస్తే.. మెరిసే చర్మం మీ సొంతం

Beauty Tips For Skin: చక్కెరతో ఇలా చేస్తే.. మెరిసే చర్మం మీ సొంతం

Beauty Tips For Skin: మీ ఫేస్ డల్‌గా కనిపిస్తుందా? ముఖం నల్లగా మారిపోతుందా? ఫేస్‌పై మొటిమలు, మచ్చలతో విసిగిపోయారా? ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇంట్లో ఉండే వస్తువులతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అందులో చక్కెర కూడా ఒకటి. తీపిగా ఉండే ఈ పదార్ధంతో.. అందాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.


చక్కెర, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా చక్కెరను మెత్తగా పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే చిన్న బౌల్ తీసుకుని.. ఐదు టేబుల్ స్పూన్ల చక్కెర పొడి, టీ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 5-10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మురికి తొలగిపోయి చాలా యవ్వనంగా కనపిస్తారు.

బాదం నూనె, చక్కెరతో ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ చక్కెర పొడి, రెండు టేబుల్ స్పూన్ బాదం నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మూడు రోజులకు ఒకసారి చేస్తే.. ముఖం నిత్యం తాజాగా, కాంతివంతంగా మెరుస్తుంది.


చక్కెర, బెల్లంతో ఫేస్ ప్యాక్
చక్కెరను, బెల్లాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మురికి, మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

చక్కెర, టమోటా ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో టమాటా రసం, చక్కెర పొడి కలిపి.. ముఖం, మెడపై 10 నిమిషాల వరకు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. మీ ఫేస్ చాలా అందంగా మారుతుంది.

చక్కెర, కాఫీపొడి, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో.. రెండు టేబుల్ స్పూన్ చక్కెర, కాఫీ పొడి, కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి యవ్వనంగా కనిపిస్తారు.

Also Read: కోమలమైన చర్మం కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

చక్కెర, బియ్యంపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
ముఖం కాంతివంతంగా, తాజాగా ఉండాలంటే.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఇందుకోసం చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యంపిండి, చక్కెర పొడి, రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. గంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేదంటే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×