Homemade Hair Dye: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట దొరికే హెయిర్ కలర్స్ వాడుతుంటాయి. అయితే వీటిని వాడటం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అంతే కాకుండా ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా కారణం అవుతాయి. అందుకే కెమికల్స్ తో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడకుండా నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇవి తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
సహజ పద్ధతిలో తెల్ల జుట్టును వదిలించుకోవాలనుకుంటే .. ఇండిగో పౌడర్ (నీలి మందు) వాడటం మంచిది. ఇండిగోతో జుట్టును నల్లగా చేసే లక్షణాలు ఉంటాయి. అంతే కాకుండా ఇది తెల్ల జుట్టును నల్లగా కూడా మారుస్తుంది.
హెయిర్ డై:
ఇండిగో పౌడర్ అనేది జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగించే ఒక సహజ ఉత్పత్తి. ఇది తెల్ల జుట్టుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని అత్యంత ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా జుట్టు రంగును ముదురు నలుపు రంగులోకి మార్చగలదు. ఇండిగో పౌడర్‌తో జుట్టును నల్లగా చేయడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే.. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో, జుట్టు బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
కావాల్సినవి:
హెన్నా- 4 టేబుల్ స్పూన్లు
ఇండిగో పౌడర్- ఒక కప్పు
కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు
వేడి నీరు – తగినంత
తయారీ విధానం:
హెన్నా, ఇండిగో పౌడర్ తో పాటు సరిపడా గోరు వెచ్చగా చేసిన నీటిని తీసుకుని ఒక గిన్నెలో మిక్స్ చేసి మందపాటి పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత నెమ్మదిగా జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేయాలి. హెయిర్ కలర్ ముఖంపై నుదురు, చెవులపై పడితే కొబ్బరి నూనెతో క్లీన్ చేయండి. కలర్ పూర్తిగా జుట్టుకు అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది తక్కువ సమయంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడుతుంది.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. చందమామ లాంటి చర్మం మీ సొంతం
ఇంట్లో తయారు చేసుకున్న హెన్నా సహజమైనదిగా ఉండి రసాయనాల్లేకుండా ఉంటుంది. ఇది తలపై చల్లదనం కలిగించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. హెన్నా జుట్టుకు సహజ రంగు ఇస్తుంది. జుట్టుకు బలపరిచి జుట్టు ఊడకుండా కాపాడుతుంది.
తైల గ్రంధుల నుంచి అధికంగా విడుదలయ్యే ఆయిల్ని నియంత్రిస్తుంది. తల చర్మంలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఇంట్లో తయారు చేయడం వల్ల ఆకుపచ్చ ఆకులు, మెంతి గింజలు, లెమన్ వంటి సహజ పదార్థాలు కలిపి అవసరాలకు తగినట్లు కూడా హెయిర్ కలర్ తయారు చేసుకోవచ్చు. జుట్టుకు రసాయన ప్రభావం లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఇలాంటి నేచురల్ హెయిర్ కలర్స్ మాత్రమే వాడాలి. ఇవి ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ కూడా కలిగించవు. హెన్నాలో ఉండే పోషకాలు జుట్టును పోడవుగా మారేలా చేస్తాయి.