Glowing Skin: ప్రతి ఒక్కరికి కోమలమైన చర్మం ఉండాలని, కళ కళాడుతూ ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ఇప్పడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు.. అనేక చర్మం సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖంపై ట్యాన్ ఏర్పడటం, మొటిమలు, మచ్చలు పలు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, దుమ్మూ మొదలైనవి. ఇక చర్మ సౌందర్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే రసాయనిక క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. ఫలితంగా అందంగా ముఖాన్ని కాస్త పొగొట్టుకుంటారు. కాబట్టి ఈ చిట్కాలు పాటిస్తే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాలు, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
గోరువెచ్చటి నీటిలో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, మూడు టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి వెళ్లే ముందు ముఖానికి పెట్టుకుని.. 20 నిమిషాల తర్వాత స్నానం చెయ్యండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. చర్మం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుంది.
కొబ్బరి పాలు, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నెలో కొబ్బరి పాలు తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో మర్దనా చేస్తూ.. ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
కొబ్బరిపాలు, గులాబీ రేకులు, తేనె ఫేస్ ప్యాక్
కొబ్బరిపాలు పావు కప్పు, గులాబీ రేకులు, రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు లేదా వారానికి మూడుసార్లు చేసిన మంచి ఫలితం ఉంటుంది. ముఖం కాంతివంతంగా, మిలమిల మెరుస్తుంది.
కొబ్బరి పాలు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో ఐదు టీ స్పూన్లు కొబ్బరి పాలు, నిమ్మరసం రెండు టీ స్పూన్లు కలిపి.. ఐదు నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి.. ముఖం అంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే.. ముఖంపై ఉన్న మురికి తొలగిపోయి తాజాగా కనిపిస్తుంది.
కొబ్బరిపాలు, బాదం పొడి, తులసి పొడి ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో పావు కప్పు కొబ్బరి పాలు, అందులో టీస్పూన్ బాదం పొడి, తులసి పొడి, టీ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. చర్మంపై మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
Also Read: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.