BigTV English
Advertisement

Pawan Kalyan : సీజ్ ది థియేటర్స్.. తనిఖీల్లో ఇవి లేకుంటే… అంతే సంగతులు

Pawan Kalyan : సీజ్ ది థియేటర్స్.. తనిఖీల్లో ఇవి లేకుంటే… అంతే సంగతులు

Pawan Kalyan :సినిమా థియేటర్లపై తాజాగా ఆకస్మిక తనిఖీ థియేటర్ యాజమాన్యానికి భారీ షాక్ కలిగించింది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఏపీలో సినిమా థియేటర్లపై తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు.. లైసెన్స్ లేకపోయినా, థియేటర్లో ఇతర సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా ..ఆ థియేటర్లను సీజ్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇంత త్వరగా ఆకస్మిక తనిఖీ చేయడం వెనుక గల కారణాలు కూడా తెరపైకి వచ్చాయి.


థియేటర్ల పై ఆకస్మిక తనిఖీ.. అసలేం జరిగిందంటే..?

అసలు విషయంలోకి వెళితే.. సినిమా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లను బంద్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమక్షంలో చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా థియేటర్ల నుంచి డబ్బులు రావడం లేదు అనేది ప్రధాన కంప్లైంట్. ఇక డబ్బులు రావాలి అంటే షేరింగ్ పద్ధతి కావాలని అటు నిర్మాతలను కూడా డిమాండ్ చేశారు. ఇకపోతే ఇదంతా గొడవలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికి అనేలా ఒక వార్త బయటకొచ్చింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన సినిమాను ఆపివేయాలని నలుగురు బడా నిర్మాతలు కలసి ప్లాన్ చేసి వీరిని రెచ్చగొట్టారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక ఆ నలుగురు బడా నిర్మాతలలో దిల్ రాజు(Dilraju), అల్లు అరవింద్(Allu Aravindh), ఏసియన్ సునీల్(Asian Sunil), దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh babu) పేర్లు ప్రధమంగా వినిపించాయి. అయితే ఇందులో తమ హస్తం లేదని అటు అల్లు అరవింద్, దిల్ రాజు ఇద్దరు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కానీ ఏషియన్ సునీల్,దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం దీనిపై స్పందించలేదు.


ఇవి లేకుంటే.. థియేటర్ సీజ్..

ఇలా పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేయాలని ప్లాన్ జరుగుతుందనే విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యాడు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి ఇష్టం వచ్చినట్లు టికెట్లు రేట్లు పెంచడానికి కుదరదు. ఏ సినిమా అయినా టికెట్ ధరలు పెంచాలి అంటే కేవలం ఫిలిం ఛాంబర్ నుంచే అనుమతి కోరడానికి ప్రభుత్వం వద్దకు రావాలి. అలాగే ప్రజలు థియేటర్లకు రావాలి అంటే థియేటర్లు శుభ్రంగా ఉండాలి. అన్ని సౌకర్యాలు ఉండాలి. పైగా క్యాంటీన్ నీట్ గా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించేలా ఉండాలి. క్యాంటీన్లో లభించే స్నాక్స్ సరసమైన ధరలకే అందుబాటులో ఉండాలి. పైగా టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇక ఆ థియేటర్ కి లైసెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే థియేటర్ రన్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. లేకపోతే వెంటనే ఆ థియేటర్ను సీజ్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయంపై అధికారులు తనిఖీలు చేపట్టగా అటు థియేటర్ యాజమాన్యం ఒక్కసారిగా అప్రమత్తమయింది. మరి పవన్ కళ్యాణ్ నిర్ణయంతోనైనా థియేటర్లలో మార్పు వస్తుందేమో చూడాలి.

ALSO READ:Kamal Haasan : కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు… ఒక్కసారిగా హీటెక్కిన తమిళ రాజకీయాలు..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×