చాలామంది పాదాలలో వాపు, నొప్పి వంటి వాటితో బాధపడతారు. అలాగే పాదాలు ఒక్కోసారి అంత పగుళ్లుగా మారుతూ ఉంటాయి. సున్నితమైన, మృదువైన పాదాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పాదాల వాపు తగ్గాలన్నా, పాదాలలో నొప్పి తగ్గాలన్నా, పాదాలపై ఉన్న చర్మం మృదువుగా మారాలన్నా ఒక సింపుల్ చిట్కాను పాటించండి. ఉప్పునీటిలో మీ పాదాలను ఒక పావుగంట సేపు నానబెట్టండి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కాలి తిమ్మిర్లు, మడమల నొప్పి, పాదాల వాపు, పాదాల నొప్పి వంటి సమస్యలు ఎన్నో తగ్గుతాయి.
సాదా ఉప్పుతో ఇలా చేయండి
ఇంట్లో సాదా ఉప్పు దొరుకుతుంది. దాన్ని సముద్రపు ఉప్పు అని కూడా పిలుస్తారు. గోరువెచ్చని నీటిలో ఈ ఉప్పును వేసి బాగా కలిపి పాదాలను అందులో పెట్టి నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అలసట వల్ల కలిగే పాదాల నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మెడ నొప్పి, తలనొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఉప్పు నీటిలో పాదాలు ఉంచినప్పుడు ఐస్ బ్యాగ్ ను భుజంపై పెట్టుకుంటే మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
డెడ్ సీ సాల్ట్
డెడ్ సీ నుంచి కూడా ఉప్పును తయారుచేస్తారు. ఈ డెడ్ సీ నుంచి వచ్చే ఉప్పు సాధారణ సముద్ర ఉప్పు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీనిలో ఈ ఉప్పులో సోడియం తక్కువగా ఉండి ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఉప్పు మీకు దొరికితే గోరువెచ్చని నీటిలో వేసి బాగా కరగబెట్టండి. తర్వాత అందులో పగిలిన మడమలతో కూడిన పాదాలను ఉంచండి. ఈ మడమల నొప్పి తగ్గడంతో పాటు పగిలిన పాదాలు కూడా మృదువుగా మారుతాయి.
పింక్ సాల్ట్
పింక్ సాల్ట్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. వెరికోస్ వెయిన్స్ అనే సమస్యతో బాధపడే వారికి పింక్ సాల్ట్ తో చేసే రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఈ పింక్ సాల్ట్ ను వేసి బాగా కలపండి. పావుగంట పాటు పాదాలను నానబెట్టండి. ఇలా ప్రతిరోజు మూడు వారాలు పాటు చేయండి. మీకు వెరికోస్ వెయిన్స్ నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలను పాటించడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.