మేకప్ కోసం వాడే ఉత్పత్తులన్నిట్లోనూ రసాయనాలు ఉంటాయి. అంతెందుకు మనం వాడే ఫేస్ పౌడర్ కూడా కార్సినో జెనిక్. అంటే అది క్యాన్సర్ కారకం. క్రీమ్ లు, ఫేస్ వాష్ లు, సీరమ్ లు ఇలాంటివన్నీ పై పూతకోసం వాడుకోవాలే కానీ, నోట్లో వేసుకుని చప్పరించకూడదు. దానివల్ల దీర్ఘకాలిక ప్రమాదాలే కాదు, అప్పటికప్పుడు కూడా దుష్ప్రభావాలు కనపడే అవకాశమంది. అలాంటి ఓ ఘటనే తైవాన్ లో జరిగింది. తైవాన్ కి చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్ గువా షుయ్ షుయ్ జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఇన్ స్టా లో గువా బ్యూటీగా పాపులర్ అయిన ఆమె అందరిలాగా వీడియోలు చేయదు. కాస్త వెరైటీగా ఉండేందుకు ఆమె మేకప్ సామగ్రిని నోటిలో వేసుకుని రుచి చూస్తుంది. ఆ అనుభవాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంటుంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
పొరపాటున బ్యూటీ ప్రోడక్ట్స్ నోట్లోకి వెళ్తే వెంటనే మనం పుక్కిళించి ఊసేస్తాం. ఆ తర్వాత నాలుగైదు సార్లు నోరు కడిగేసుకుంటాం. కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఉద్దేశపూర్వకంగానే నోట్లో వేసుకుని చప్పరిస్తుంది గువా బ్యూటీ. అది సరదాకి మాత్రం కాదు. కేవలం తన ఫాలోవర్స్ ని పెంచుకోడానికే ఆమె ఈ ట్రిక్ ప్లే చేస్తోంది. అది ఆమెకు అలవాటుగా మారింది. చివరకు అదే ఆమె ప్రాణాలు తీసినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కారణం ఇదీ అని కుటుంబ సభ్యులు చెప్పలేదు కానీ, ఆమె ఇక లేదు అంటూ అదే అకౌంట్ లో పోస్టింగ్ పెట్టారు. కొంతమంది మాత్రం ఆమె చావుకి కారణం బ్యూటీ ప్రోడక్ట్స్ ని తినడం కాదు అని అంటున్నారు. మరి 24 ఏళ్ల ఓ యువతి అకస్మాత్తుగా ఎందుకు చనిపోతుంది..? ఈ ప్రశ్నకు మాత్రం కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ సమాధానం చెప్పడంలేదు.
గువా బ్యూటీ చేసిన ప్రతి వీడియో సారాంశం ఒకటే. ఒక్కో వీడియోలో ఒక్కో బ్యూటీ ప్రోడక్ట్ ని ఆమె పరిచయం చేస్తుంది. వాటికి ఫుల్లుగా ప్రచారం కూడా కల్పిస్తుంది. అలా ఆయా బ్యూటీ ప్రోడక్ట్స్ సంస్థలతో ఆమె టైఅప్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫలానా ప్రోడక్ట్ కొనడం అంటే ఎవరు మాత్రం ఆ వీడియో చూస్తారు, ఫలానా ప్రోడక్ట్ వాడి నేను ఇంత అందంగా తయారయ్యాను అని చెప్పడం కూడా పాత స్టైలే. అందుకే గువా బ్యూటీ సరికొత్త టెక్నిక్ ఉపయోగించారు. ఆయా సౌందర్య సాధనాలను, ఉత్పత్తులను ఆమె రుచి చూస్తారు. రుచిచూడటం అంటే ఏదో కెమెరా ముందు నటించడం కాదు, నిజంగానా వేటిని నోటిలో పెట్టుకుని ఆమె చప్పరిస్తుంది. అలా చప్పరించిన తర్వాత ఆమె ఒకర రకమైన వింత ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది. అలా ఆమె పాపులర్ అయింది.
ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తన వీడియోలు చూడటానికి అనుమతించబడరని ఆమె తన ఇంట్రడక్షన్ లో సందేశాన్ని ఉంచింది. సౌందర్య ఉత్పత్తులను తినడం అపాయకరం అని, అది నిషేధ అని కూడా చెబుతోంది. కానీ తాను మాత్రం రుచి చూస్తోంది. చాలామంది ఆమె వీడియోలను చూస్తుటారు, లైక్ చేస్తుంటారు. కొందరు ఆమె పిచ్చి చేష్టల్ని తిడుతుంటారు. ఇలా తినడం వల్ల వ్యాధులు వస్తాయని చెబుతుంటారు. ఇంకొందరు.. ఆ రుచి ఎలా ఉంది మరింత బాగా వివరించండి అంటూ కామెంట్ చేస్తుంటారు. లేదా ఫలానా ప్రోడక్ట్ ని కూడా టేస్ట్ చేసి చెప్పరా అంటూ వెటకారం చేస్తుంటారు. ఈ కామెంట్లు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఆమె లేదు. అర్థాంతరంగా ఆమె జీవితం ముగిసిపోడానికి కారణం ఎవరు..? బ్యూటీ ప్రోడక్ట్స్ ని తినడం వల్లే ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.