BigTV English

New Zealand MP: పార్లమెంట్‌లో తన న*గ్న ఫొటోను ప్రదర్శించిన మహిళా ఎంపీ.. ఎందుకంటే?

New Zealand MP: పార్లమెంట్‌లో తన న*గ్న ఫొటోను ప్రదర్శించిన మహిళా ఎంపీ.. ఎందుకంటే?

New Zealand MP: ఓ మహిళా ఎంపీ తన నగ్న ఫోటో చూపించి అందరినీ షాక్ కు గురి చేసింది. అది కూడా పార్లమెంట్ సమావేశంలో తన నగ్న ఫోటోను ప్రదర్శించిన ఎంపీ, ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక సమస్యను వెలుగులోకి తెచ్చింది. తన ఫోటోను ఆ తీరులో చూపించేందుకు కాస్త భయపడ్డా, తనకు తప్పలేదని ఆ ఎంపీ చెప్పడం విశేషం. ఇక అసలు విషయం ఏమిటంటే?


ఎంపీజీ.. మీ ధైర్యానికి సలామ్!
పార్లమెంటు సభా వేదికపై ఏకంగా తన నగ్న ఫొటోను చూపిస్తూ షాకిచ్చింది న్యూజిలాండ్ మహిళా ఎంపీ. అది నిజమైనదేమీ కాదు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించబడిన నకిలీ చిత్రం. అయినా కూడా అంతటి పెద్ద వేదికపై, అంతటి వాతావరణంలో, తన నకిలీ నగ్న చిత్రాన్ని ప్రదర్శించడానికి ఆమె వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఆమె లక్ష్యం పెద్దది. సమాజానికి ప్రమాదకరంగా మారుతోన్న డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి అందరికీ చూపించాలన్న దృఢ సంకల్పమే ఆమెను ఆ పని చేయించింది.

పార్లమెంట్‌లో ఎందుకంటే?
ఇటీవల న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎంపీ లారా మెక్‌క్లూర్ పార్లమెంటరీ సభలో తన నగ్న ఫోటోను చూపించడంతో సభ్యులందరూ షాక్‌కి గురయ్యారు. అయితే ఆ ఫోటో నిజమైనదేమీ కాదు.. అది AI ఆధారంగా రూపొందించిన డీప్‌ఫేక్ చిత్రం. ఇది చూపిస్తూ ఆమె ఇచ్చిన సందేశం మాత్రం చాలా తీవ్రమైనదిగా చెప్పవచ్చు. ఆమె వాదన ఏమిటంటే.. డీప్‌ఫేక్‌లు మహిళలకు, యువతకు తీవ్ర మానసిక హానిని కలిగిస్తున్నాయి, చట్టాల పరిధిలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని వక్కాణించి ఆమె పలికింది.


ఈ ప్రదర్శన లక్ష్యం ఒకటే..
డీప్‌ఫేక్‌ల వలన కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడమేనని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నా నిజమైన ఫోటో కాదన్న విషయం నాకు తెలుసు. అయినా కూడా దీన్ని ప్రజల ముందు చూపడం, అదీ పార్లమెంట్‌లో, ఒక అసౌకర్యమైన పని. కానీ ఇలా చేయకపోతే దీని దారుణ ఫలితాలు ఎవరికీ అర్థం కావని మెక్‌క్లూర్ పేర్కొన్నారు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ.. వెనక దాగున్న చీకటి
డీప్‌ఫేక్ అనేది AI ఆధారిత వీడియో, ఫోటో మార్పిడి టెక్నాలజీ. దీని సహాయంతో ఎవరి ముఖాన్నైనా, శరీరాన్నైనా మానిప్యులేట్ చేయడం సాధ్యమవుతుంది. మానవులు ఎప్పుడూ చెప్పని మాటలు పలికినట్టు, చేయని పనులు చేసినట్టు చూపించడమే దీని తీరైన ప్రమాదం. ఇటీవల పలు సెలబ్రిటీల ఫోటోలను కూడా డీప్‌ఫేక్ రూపంలో వైరల్ చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ మహిళా ఎంపీ తన ఆవేదన ఏకంగా భిన్నరీతిలో వినిపించారు.

ఐదు నిమిషాల్లో తయారైన అలాంటి ఫోటో
మెక్‌క్లూర్ తన ప్రసంగంలో ఒక ఘోర వాస్తవాన్ని బయటపెట్టారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఆమె నగ్న డీప్‌ఫేక్ ఫోటో తయారైంది. అది ఎక్కడైనా, ఎవరి మీదైనా చేయొచ్చు. ఇది మహిళల జీవితాల్లో ఎంత పెద్ద ప్రమాదమో ఆమె అనుభవంతో చెప్పారు. యువతులు, విద్యార్థినులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఎవ్వరూ మినహాయింపు కాదన్నారు.

న్యాయ వ్యవస్థ లోపం.. ఇప్పుడు మారాలంటే?
ప్రస్తుతం న్యూజిలాండ్ చట్టాల ప్రకారం సమ్మతి లేకుండా నిజమైన నగ్న చిత్రాలను పంచుకోవడం నేరం. కానీ డీప్‌ఫేక్‌లను చట్టపరంగా స్పష్టంగా నిషేధించలేదు. ఇదే విషయం మెక్‌క్లూర్ హైలైట్ చేస్తూ 2025 మే 12న డీప్‌ఫేక్ డిజిటల్ హాని బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ చట్టాలలో మార్పులు తీసుకురావాలనేది లక్ష్యమని, ముఖ్యంగా డిజిటల్‌గా తయారైన చిత్రాలు, వీడియోలను సన్నిహిత దృశ్య రికార్డింగ్ అనే నిర్వచనంలో చేర్చాలని భావిస్తున్నారన్నారు.

Also Read: Rare Fish: తీరానికి కొట్టుకొస్తున్న ఆ చేపలు.. వణికిపోతున్న జనాలు, అదే జరిగితే?

భయం వేసింది.. కానీ చేయాల్సిందే అనిపించింది
మెక్‌క్లూర్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ తనను తాను ఓవర్‌కమ్ చేసిన అనుభూతిని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని చూపించడానికి నాకు భయం వేసింది. కానీ సమాజానికి, ముఖ్యంగా మన యువతులకు ఇది తెలుసుండాలి. ఇదొక శత్రువు. దీన్ని చట్టపరంగా అడ్డుకోవాలని ఆమె ప్రసంగించారు.

యువత కోసం పోరాటం
ఈ ఘటన తర్వాత లారా మెక్‌క్లూర్ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ, డీప్‌ఫేక్‌లు యువత జీవితాలను తుడిచివేస్తున్నాయి. మానసికంగా, సామాజికంగా, ఉద్యోగంగా వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. మహిళలపై జరిగిన డీప్‌ఫేక్ దాడుల కారణంగా ఎంతో మంది యువతులు ఇంటి దాకా పరిమితమయ్యారన్న విషయాన్ని ఆమె హైలైట్ చేశారు.

లారా మెక్‌క్లూర్ పార్లమెంట్ వేదికపై తీసుకున్న నిర్ణయం సాధారణమైనది కాదు. ఆమె చేసిన ఈ సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్‌లపై చట్టాల రూపకల్పనకు దారితీసేలా మారింది. ఇది ఒక మహిళ చూపిన ధైర్యానికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. డీప్‌ఫేక్ టెక్నాలజీ వాడకానికి సరైన నియంత్రణలు లేకపోతే, అది మన జీవితాల్లో నిర్మూలించలేని నష్టాన్ని మిగుల్చుతుంది. ఎంపీ లారా మెక్‌క్లూర్ చేసిన ఈ కదలిక డిజిటల్ యుగంలో నైతికతకు గౌరవం, మహిళల గౌరవానికి రక్షణ అనే దిశగా ఓ మేలుకొలుపుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×