Late Pregnancy: ప్రస్తుత కాలంలో లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే.. అమ్మాయిలు కూడా కెరీర్ ఆప్షన్ వెతుక్కుంటున్నారు.. బయటకు వెళ్తున్నారు. అబ్బాయిలకు సమానంగా పని చేస్తున్నారు. చాలా క్లియర్‌గా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంత బాగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయిలు మీ మ్యారేజ్ లైఫ్‌ను కూడా ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం చాలా మంది అమ్మాయులు 28-30 తర్వాత పెళ్లిల్లు చేసుకుంటున్నారు.
అయితే పెళ్లి అయినాకా వెంటనే పిల్లలు వద్దు.. జాబ్ చేయాలి.. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి, ఆర్ధికంగా స్థిరపడాలని.. తమ కెరియర్ కోసం దంపతులు పిల్లల్ని కనడం వాయిదా వేస్తున్నారు. చాలా మంది 35 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడానికి సిద్ధమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అయితే లేట్ ప్రెగ్నెన్సీ వల్ల లాభాలు నష్టాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
నష్టాలు చూద్దాం..
లేటుగా పిల్లల్ని కనడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లేటుగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల అమ్మయిల్లో యగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అంటే.. మంచి క్వాలిటీ ఉన్న ఎక్స్ రిలీజ్ అవడం వంటివి తగ్గిపోతాయి. అలాగే స్ట్రెస్ లెవల్ పెరుగుతున్న కొద్ది అమ్మాయిల్లో ఒబెసిటీ వంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. లేటుగా గర్భం దాల్చడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కొందరు పిల్లలు అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉంది. అమ్మయిలే కాదు అబ్బాయిల్లో కూడా లేటుగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అయితే కెరియర్‌లో ముందుకు వెళ్లాలి, లైఫ్‌లో సెటిల్ అవ్వాలి.. మరి దీనికి సొల్యూషన్ లేదా.. అని అనుకునే అమ్మాయులకు కొన్ని సూచలను, సలహాలు ఉన్నాయి. ఇవి పాటించారంటే.. మీకు మేలు జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి రోజు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా డైట్ ఫాలో అవ్వాలి. కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి. సరైనా పోషకాహారం తీసుకోవాలి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి మీ డైట్‌లో తీసుకోవచ్చు. ఇవి తినడం వల్ల గర్భసంచి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రిలీజ్ అయ్యే అండాలు కూడా హెల్దీగా ఉంటాయి. ఈ గింజలు తినడం వల్లన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇవన్ని పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
Also Read: చాలా మంచోడని.. పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నా, ఈ తరహాలో ఏ భర్త వేధించడేమో!
ఇంకా లేటుగా మ్యారేజ్ చేసుకోవాలి ఒక 40 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి. అప్పుడు పిల్లల్ని కంటాను అనుకునే వారికి ఇంకో సలహా ఉంది. అదే యూసైట్ ఫ్రీజింగ్ .. అంటే మీ అండాశయం నుంచి ఎగ్స్ తీసుకుని ఫ్రీజ్ చేస్తారు. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఎగ్స్ నుంచి మీరు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. మరీ లేటుగా పెళ్లి చేసుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ ఇని చెప్పొచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు పెళ్లి తొందరగా అయిన పిల్లలు పుట్టరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించవలసి ఉంటుంది.
లాభాలు..
లేటుగా గర్భం దాల్చడం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. అవి ఏమిటంటే 35 ఏళ్ల తర్వాత పిల్లల్లి కనేసరికి ఆర్ధికంగా స్థిరపడవచ్చు.. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. 30 ఏళ్లు దాటిన అమ్మాయిల్లో స్పష్టత ఉంటుంది. మంచి అవగాహన ఉంటుంది. పిల్లల అల్లరిని అర్ధం చేసుకునే ఆలోచన కలిగి ఉంటారు. 35 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారట. ఓ అధ్యయనంలో తేలింది. ఏది ఏమైనా పెళ్లి, ప్రెగ్నెన్సీ వాయిదా వేయడం అస్సలు మంచిది కాదు. ఏవయస్సులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అన్ని విధాల మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.