BigTV English
Advertisement

Fenugreek Seeds: మొలకెత్తిన మెంతులతోను ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Fenugreek Seeds: మొలకెత్తిన మెంతులతోను ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Fenugreek Seeds: మెంతులతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, బీపీ వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా బాధపడే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతులు రుచికి చేదుగా ఉన్నా కూడా వీటిని తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే మెంతులతోనే కాదు మొలకెత్తిన మెంతులతోను అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన మెంతులను తినడం వల్ల ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.


పరగడుపున తరచూ మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. మెంతులు సోడియం స్థాయిలను కూడా తగ్గిస్తాయి. అంతేకాదు రుతుక్రమం సరిగా లేని మహిళలు కూడా మెంతులను తీసుకోవడం వల్ల సహాయపడుతుంది. పీఎంఎస్ వంటి లక్షణాలు తగ్గిపోతాయి. మరోవైపు జీర్ణక్రియ, ఉబ్బరం వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ నిరోధకతను కూడా తగ్గించేందుకు మొలకెత్తిన మెంతులు సహాయపడతాయి.

మెంతులే కాదు మెంతికూరను కూడా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో కూడా పోరాడుతుంది. బీపీ, కొలస్ట్రాల్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఉన్న వారు మెంతులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక నెలసరి సమయంలో అమ్మాయిలు మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఇది పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తుంది.


Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×