E-Paper
Advertisement

వేసవిలో పానీపురీ, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తింటున్నారా? జాగ్రత్త డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వేసవిలో పానీపురీ, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తింటున్నారా? జాగ్రత్త డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

Summer Street food Safety| చాలామంది రుచి కోసం.. స్ట్రీట్ ఫుడ్ (రోడ్డుపై లభించే ఆహారం) తినడానికి ఇష్టపడతారు. అయితే, వేసవిలో చైనీస్ ఫాస్ట్ ఫుడ్, పానీపురీ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల ఆహారం త్వరగా చెడిపోయి, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. బెంగుళూరు అపోలో క్లినిక్‌లో జెనెరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ శిల్పా బాగల్‌కోట్కర్ ప్రకారం.. ఈ ప్రమాదాలను అర్థం చేసుకోవడం, సేఫ్టీ టిప్స్ పాటించడం ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం.

1. వేసవిలో స్ట్రీట్ ఫుడ్ ఎందుకు ప్రమాదకరం?

వేసవిలో వేడి వలన బ్యాక్టీరియా చాలా త్వరగా పెరుగుతుంది. సాల్మొనెల్లా, ఇ కోలి వంటి వంటి బ్యాక్టీరియా వెచ్చని వాతావరణంలో విజృంభిస్తాయి. ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి, కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

2. స్ట్రీట్ ఫుడ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే

Advertisement

కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు సాధారణ సమస్యలు. కొన్నిసార్లు జ్వరం, శరీరంలో నీరు తగ్గిపోవడం కూడా రావచ్చు. సరైన చికిత్స లేకపోతే ఇవి తీవ్రమవుతాయి.

3. పేలవమైన పరిశుభ్రత ఎందుకు ప్రధాన సమస్య?

స్ట్రీడ్ ఫుడ్ విక్రయించే చాలామంది వీధి వ్యాపారులు పరిశుభ్రత పాటించరు. వంటచేసేవారు మురికి నీరు, మురికి పాత్రలు ఉపయోగిస్తున్నారని చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. వండిన తరువాత ఆహారం బయట పెడతారు. దీని వల్ల ఇందులో దుమ్ము పడడం, ఈగల వాలడం జరుగుతుంది. ఈ కారణంగా ఆ ఆహారం తిన్నవారు అనారోగ్యం పాలవుతారు.

4. కట్ ఫ్రూట్స్, జ్యూస్లు కూడా ప్రమాదకరం?

Advertisement

వేసవిలో కట్ చేసిన పండ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ వీటిని సరిగా కప్పి ఉంచరు. ఈ కారణంగా అందులో బ్యాక్టీరియా అంటుకుంటుంది. కలుషిత నీరు లేదా అందులో ఐస్ వేయడం వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు.

5. వేడి, తాజా ఆహారం ఎందుకు సురక్షితం?

వేడిగా ఆహారంలో చాలావరకు బ్యాక్టీరియా చనిపోతుంది. గంటల తరబడి రూం టెంపరేచర్‌లో ఉన్న ఆహారం మానేయండి. తాజాగా వండిన ఆహారమే ఎప్పుడూ సురక్షితమైన ఆప్షన్.

స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

  • శుభ్రంగా ఉండే, ఎక్కువ మంది కస్టమర్లు ఉండే దుకాణాలు ఎంచుకోండి.
  • బయట లభించే పచ్చి సలాడ్లు, తెరిచి ఉన్న పచ్చళ్ళు, చట్నీలు తినడం మానేయండి.
  • తెలియని చోట్ల నీరు తాగకండి. బాటిల్ నీరు తాగండి.
  • వంటచేసే వారు శుభ్రమైన పాత్రలు, తాజా పదార్థాలు ఉపయోగిస్తున్నారా? లేదా అని గమనించండి.

తిన్న తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి

జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అనారోగ్యం రావచ్చు. కడుపు నొప్పి, వాంతులు లాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే
సరైన చికిత్స అవసరం. ఎక్కువ నీరు తాగండి, విశ్రాంతి తీసుకోండి.

Also Read: వేసవిలో ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

అవగాహన ఎందుకు ముఖ్యం?

వేసవిలో స్ట్రీడ్ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్యం గురించి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ వేడి వాతావరణంలో ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగిపోతాయి. చిన్న జాగ్రత్తలతో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

Related News

షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి టెన్షన్ పడుతున్నారా? లంచ్‌లో ఇవి తింటే సరి

ఇతరుల కంటే కొందరు ఎల్లప్పుడూ ముందుంటారు.. విజయం కోసం మనిషిలో ఈ లక్షణాలు తప్పనిసరి

ఏసీ గదిలో నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా? దానికి కారణాలు ఇవే

తలుపుల వెనుక వస్తువులు, బట్టలు వేలాడదీయడం అశుభం.. వాస్తు ప్రకారం జరిగే నష్టాలు ఇవే

బక్రీద్ రోజున ముస్లింలు మేకను ఎందుకు బలి ఇస్తారు? హృదయాన్ని కలిచివేసే కథ

వేసవిలో బీర్ కాక్‌టైల్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. ఇంట్లో ఇలా తయారు చేయండి

ఎండకాలంలో పిల్లల ఆరోగ్యం.. ఈ సింపుల్ చిట్కాలతో వడదెబ్బకు గుడ్ బై చెప్పండి

శ్రమ లేకుండా,దుమ్ము పడకుండా.. సీలింగ్ ఫ్యాన్‌ శుభ్రం చేసే స్మార్ట్ ఐడియాస్

Big Stories

Advertisement
×