BigTV English

Student Success Strategies : విద్యార్థులకు విజయ సూత్రాలు.. ఇవి పాటిస్తే మీరే టాపర్..

Student Success Strategies : విద్యార్థులకు విజయ సూత్రాలు.. ఇవి పాటిస్తే మీరే టాపర్..
Student Success Strategies

Student Success Strategies : క్లాస్‌లో టాపర్ అవ్వాలనుకునే విద్యార్థులు మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే యువత చదివే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటివల్ల జీవితంలో ఇబ్బందులను కొన్నితెచ్చుకున్నట్టే అవుతుంది. మరి ఆ తప్పిదాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడదామా?


ప్లానింగ్ ఉండాల్సిందే..

  • చాలా మంది ఎగ్జామ్స్ సమయం ఆసన్నమయ్యాక చదవడం ప్రారంభిస్తారు. ఇలా మొదట్లో బద్ధకంగా ఉండి చివర్లో చదవడం వల్ల చాలా నష్టపోతారని గుర్తుంచుకోండి. దీనివల్ల అనుకున్న లక్ష్యాలను సాధించలేరు.
  • ప్లాన్ లేకుండా చదవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు. దేనికైనా సరైన ప్లాన్ ఉండాల్సిందే.
  • చదివింది ఎక్కువ కాలం గుర్తుండాలంటే సరైన పొజిషన్‌లో కూర్చోవడం చాలా అవసరం. చదివేటప్పుడు టేబుల్, కుర్చీ సహాయం తీసుకోండి.

సెల్ఫ్‌కేర్ తీసుకోవాల్సిందే..


  • చాలామంది గ్యాప్ లేకుండా గంటల కొద్దీ చదువుతుంటారు. అయితే సగటు మానవుడి మెదడు 3 గంటల కంటే ఎక్కువ సమయం చురుగ్గా పనిచేయదు. అందువల్ల గంట లేదా రెండు గంటలకు ఒకసారి మెదడుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఈ సమయంలో ధ్యానం చేయడం లాంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి.
  • సరైన ఆహారం లేకుండా, సరైన నిద్ర, విశ్రాంతి లేకుండా, సరైన లైఫ్ స్టైల్ లేకుండా చేసే ఏ పనిలోనూ మనిషి పూర్తిస్థాయిలో ఏకాగ్రత సాధించలేడు. అది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికే ప్రమాదం అనే విషయం మర్చిపోవద్దు.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×