BigTV English

Amazon Drone : అమెజాన్ డ్రోన్ డెలివరీ.. సేవల విస్తరణ

Amazon Drone : అమెజాన్ డ్రోన్ డెలివరీ.. సేవల విస్తరణ
Amazon Drone

Amazon Drone : వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో అమెజాన్ ముందుంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డెలివరీలను మరింత వేగవంతం చేస్తోంది. వస్తువుల చేరవేతలో వ్యవధిని తగ్గించే లక్ష్యంతో ఇప్పటికే డ్రోన్లను వినియోస్తోంది. ఏడాది క్రితం అమెరికాలో ఈ తరహా సేవలు మొదలయ్యాయి. దీనిని ప్రైమ్ ఎయిర్ ప్రోగ్రామ్ అని వ్యవహరిస్తున్నారు.


తాజాగా ఈ సేవలను అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇటలీ, బ్రిటన్ దేశాలకూ విస్తరించనుంది. ఆయా దేశాల్లో ఏ ఏ నగరాలకు సేవలను విస్తరించనున్నారన్న వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. డ్రోన్ డెలివరీ సిస్టంలో ప్రైమ్ ఎయిర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది.
ఏడాదిగా ఈ సేవలను పొందుతున్న అమెరికన్ల నుంచి సంతృప్తికర స్పందనే లభిస్తోంది. 2.5 కిలోల లోపు బరువున్న ప్యాకేజిలను గంట, అంత కన్నా తక్కువ వ్యవధిలోనే వినియోగదారుల గుమ్మం వద్దకు విజయవంతంగా చేర్చగలుగుతోందా సంస్థ.

మరింత వేగంగా డెలివరీలు అందజేసేందుకు అమెజాన్ ఎంకే30 అనే
లేటెస్ట్ డ్రోన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న డ్రోన్లకు ఇవి రెట్టింపు దూరం ప్రయాణించగలవు. దీని వల్ల రిమోట్ ఏరియాల్లోని వినియోగదారులకు ప్యాకేజీల చేరవేత మరింత సులభతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్యాకేజీల సురక్షితంగా, వేగవంతంగా కస్టమర్లకు చేర్చేందుకు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే కొత్త రోబోటిక్స్ వ్యవస్థ సిక్వోయాను అమెజాన్ ఏడాదిగా వినియోగిస్తోంది.


ఈ వ్యవస్థ వల్ల స్టోర్లలో వస్తువులను వెతికే సమయం, ఆయా ఉత్పత్తులను స్టోర్ ర్యాక్‌ల నుంచి తీసి డెలివరీ సిబ్బందికి అందించే సమయం బాగా తగ్గింది. ఫలితంగా డెలివరీల వేగం దాదాపు 75% పెరిగింది. స్టోర్లలోని ఎత్తైన ర్యాక్‌ల నుంచి వస్తువులను తీసేటప్పుడు డెలివరీ సిబ్బంది గాయాలకు లోను కాకుండా చూడటంలోనూ సిక్వోయా ఉపయుక్తంగా ఉంది. ఏఐతో నడిచే రోబోటిక్ ఆర్మ్ ఈ పనులను చక్కబెడుతోంది. లాజిస్టిక్స్, సప్లై చెయిన్ ను మరింత మెరుగుపర్చేందుకు అమెజాన్ నిరుడు ఒక బిలియన్ డాలర్లు కేటాయించింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×