BigTV English

Sugarcane Juice : సమ్మర్.. చెరకురసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

Sugarcane Juice : సమ్మర్.. చెరకురసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

Sugarcane


 

Sugarcane Juice Benefits : సమ్మర్ ప్రారంభమై ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ వాటర్, జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతుంటారు. ఏ సీజన్ అయిన శరీరంతో తగినంత నీటి నిల్వలు ఉండటం ముఖ్యం. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. హెల్దీగా ఉంటారు. ఎండ వేడికి తట్టుకోవడానికి తాగే జ్యూసుల్లో చెరకురసం కూడా ఒకటి.


స్వచ్ఛమైన చెరకురసం అనేక సమస్యలను నివారిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ఈ రసంలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది. ఇది తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..

READ MORE : సమ్మర్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి!

తక్షణ శక్తి

ఒక గ్లాసు చెరకురసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ ఎనర్జీని అందిస్తాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.

లివర్ ఆరోగ్యం

లివర్ ఆరోగ్యానికి చెరుకురసం చాలా మంచిది. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఇది కూడా ఒకటి. లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల కామెర్లు వస్తాయి. చెరుకురసంలో ఉండే గుణాలు శరీరంలోని ట్యాక్సిన్స్‌ని దూరం చేస్తాయి. దీనివల్ల లివర్ హెల్దీగా ఉంటుంది.

మూత్ర విసర్జన

చెరుకురసంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తాగడం వల్ల మూత్రవిసర్జన సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మన శరీరంలోని అదనపు ఉప్పు, నీటి శాతాన్ని తొలగిస్తుంది. అందువల్ల మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. దీనిని తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య దూరమవుతుంది.

క్యాన్సర్ కారణాలు

చెరుకురసం క్యాన్స‌ర్ వ్యాధి రాకుండా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా, వృద్ధి చెందకుండా నిరోధించే గుణాన్ని చెరకురసం కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

చర్మ ఆరోగ్యం

చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్‌తో పాటుగా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన చర్మానికి మేలు చేస్తాయి. మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంతేకాకండా చెరకురసం తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు దురమవుతాయి. చర్మం కూడా మెరుస్తుంది. చర్మంపై మొటిమలు మంటను చెరకురసం నివారిస్తుంది. ఇది గ్లైకోలిక్ యాసిడ్ వంటి ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలను కలిగి ఉంటుంది.

READ MORE :  డీహైడ్రేషన్‌కు గురైతే.. మన శరీరంలో కనిపించే లక్షణాలు!

జీర్ణ సమస్య

చెరకురసం జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది. ఇది కడుపులో pH స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ ద్రవాలను విడుదలను మెరుగుపరుస్తుంది. జీర్ణశయాంతర వ్యాధుల నుండి రక్షిస్తుంది.

డయాబెటిస్

చెరకురసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. ఇందులో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు చెరుకు రసాన్ని హాయిగా తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గిస్తుంది. అలానే ఎముకలు, దంతాల పెరుగుదలను చెరకురసం ప్రోత్సహిస్తుంది.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహాల మేరకు పలు అధ్యయనాల ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×