BigTV English

CM YS Jagan Comments On AP Capital : ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన.. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా..

CM YS Jagan Comments On AP Capital : ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన.. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా..

 


YS Jagan Speech In Vizag

 


YS Jagan Speech In Vizag(ap election latest news today): ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తామని ప్రకటించారు. ఇక్కడే సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పారు.

నగరంలో విజన్‌ విశాఖ పేరుతో నిర్వహించిన ఏపీ డెవలప్ మెంట్ సదస్సులో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. రాజధాని విషయంలో మరోసారి స్పష్టత ఇచ్చారు. ఏపీ విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడే ఉన్నాయన్నారు. దాని ఎఫెక్ట్ ఏపీపై పడిందనన్నారు. కానీ ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. హైదరాబాద్ కన్నా ఎక్కువగా విశాఖలో డెవలప్ మెంట్ జరుగుతోందని తెలిపారు.

విశాఖపట్నంలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బెంగళూరు కంటే ఎక్కువగా సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కానీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రయోజనాలు చేకుర్చాలన్న లక్ష్యంతో వార్తలు ఇస్తున్నాయని ఆరోపించారు.

Read More: వైసీపీకి మరో బిగ్‌షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా.. టీడీపీలో చేరి అక్కడి నుంచి బరిలోకి..

ఏపీ రాజధాని విశాఖేనని తేల్చేసిన సీఎం వైఎస్ జగన్ అమరావతిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని తెలిపారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేయాలని వివరించారు. అంత ఖర్చు చేస్తేనా మౌళిక సౌకర్యాలు కల్పించగలుగుతామన్నారు.

విశాఖను తక్కువ ఖర్చుతోనే రాజధానిగా అభివృద్ధి చేసుకోవచ్చని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అందుకే వైజాగ్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖసలో స్టేడియాన్ని నిర్మించామన్నారు. ఈ నగరాన్ని ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లా డెవలప్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

Tags

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×