BigTV English

Protein Deficiency: శరీరంలో ప్రొటీన్ లోపిస్తే.. కనిపించే లక్షణాలు !

Protein Deficiency: శరీరంలో ప్రొటీన్ లోపిస్తే.. కనిపించే లక్షణాలు !

Protein Deficiency: శరీరం సక్రమంగా పనిచేయాలంటే తగినంత ప్రొటీన్ అవసరం. పొటీన్లు కణజాలాలను నిర్మించడంతో పాటు వాటిని మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఎంజైమ్‌లు, హార్మోన్‌లను ఉత్పత్తి చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.


మంచి ఆరోగ్యం కోసం మనకు నిత్యం పోషకాలు అవసరం. అందుకే శరీరానికి అవసరమైన చాలా మూలకాలను సరఫరా చేయగల ప్రొటీన్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మన ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం అంటున్నారు. కండరాలను నిర్మించడంలో, చర్మం, జుట్టు ,గోళ్లను ఆరోగ్యంగా , బలంగా ఉంచడంలో ప్రొటీన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే అందుకు కారణం ప్రొటీన్ లోపం కూడా కావచ్చు. మరి మీకు కూడా ప్రొటీన్ లోపం ఉందా ? ప్రొటీన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనకు రోజు ఎంత ప్రోటీన్ అవసరం ?


పెద్దలకు ప్రతి రోజు కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు, 75 కిలోల బరువున్న వ్యక్తి రోజు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ లోపిస్తే.. శరీరం యొక్క నిర్మాణం మారడం ప్రారంభమవుతుంది. ఇది మెరుగుపడకపోతే, కాలేయ వ్యాధి, ఎముక సమస్యలు, పిల్లల అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది.

మీ రోగనిరోధక శక్తి బలహీనపడిందా ?

రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్ సి , డి ముఖ్యమైనవిగా చెబుతారు. మీకు ప్రొటీన్ లోపం ఉంటే అది మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? ప్రొటీన్ లోపం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 2% ప్రొటీన్లు మాత్రమే ఉన్న ఆహారాన్ని తీసుకునే జంతువుల కంటే 18% ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకున్న జంతువులకు అంటు వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని జంతు అధ్యయనాలు వెల్లడించాయి.

మహిళల్లో జరిగిన ఒక చిన్న అధ్యయనంలో తొమ్మిది వారాల పాటు తక్కువ ప్రొటీన్‌లు ఉన్న ఆహారాన్ని తిన్న వారి రోగనిరోధక ప్రతిస్పందనను గణనీయంగా తగ్గించిందని తేలింది.

ప్రొటీన్ లోపిస్తే ఏం జరుగుతుందంటే ?

కండరాల బలహీనత,  అలసట:

కండరాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి ప్రోటీన్ కూడా అవసరం. మీరు తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే మీ శరీరం దాని ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. దీర్ఘకాలిక ప్రోటీన్ లోపం కండరాల నష్టం, బలహీనతకు దారితీస్తుంది. మీరు రోజువారీ జీవితంలో వస్తువులను ఎత్తడంలో లేదా మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటే, లేదా బలం లేమిగా భావిస్తే, అది ప్రోటీన్ లోపానికి కారణం కావచ్చు.

Also Read: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా ? ముందుగానే జాగ్రత్త పడకపోతే అంతే !

చర్మం, గోళ్ల సమస్యలు:

జుట్టు, చర్మం, గోర్లు ప్రధానంగా ప్రోటీన్‌తో తయారవుతాయి. మీ ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే మీ జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ప్రొటీన్ లోపం వల్ల గోళ్లు పెళుసుగా మారడంతోపాటు చర్మం పొడిబారుతుంది.అంతే కాకుండా గోళ్లు పొరలుగా మారే ప్రమాదం ఉంది. ప్రొటీన్ లోపం వల్ల చర్మం, గోళ్ల సమస్యలు వస్తాయి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×