Regina Cassandra:రెజీనా కసాండ్రా (Regina Cassandra).. ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు. తొలుత ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సౌఖ్యం’, ‘కొత్తజంట’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా వరుస ఆఫర్స్ వచ్చాయి. అలా సౌత్ ఇండస్ట్రీలో రెజీనా కసాండ్రా అప్పట్లో చాలా వైరల్ గా మారిపోయింది.అయితే రెజీనా కసాండ్రా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఎస్ఎంఎస్( శివ మనసులో శృతి ). ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత సందీప్ కిషన్ (Sandeep Kishan) తో చేసిన రొటీన్ లవ్ స్టోరీ సినిమానే రెజీనాకి గుర్తింపును ఇచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్ (Allu Sireesh) తో ‘కొత్తజంట’ మూవీ లో నటించింది. ఆ తర్వాత చేసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మూవీ రెజీనాకి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చేలా చేసింది.
విదాముయార్చి ప్రమోషన్స్ రెజీనా..
అలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగు లో ఎక్కువగా అవకాశాలు అయితే లేవు. చివరిగా ఈ హీరోయిన్ తెలుగులో షాకిని డాకిని అనే మూవీలో కనిపించింది. ప్రస్తుతం అజిత్ (Ajith), త్రిష(Trisha) కాంబినేషన్లో వచ్చిన ‘విదాముయార్చి’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రెజీనా కసాండ్రా.. తన మతం గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
మతం మారడంపై ఊహించని కామెంట్స్..
రెజీనా కసాండ్రా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నా అసలు పేరు రెజీనా మాత్రమే. కానీ మా తల్లిదండ్రుల విడాకుల తర్వాత నా పేరు చివర కసాండ్రా అనే పేరు కూడా యాడ్ అయ్యింది. అలాగే నేను పుట్టినప్పుడు ఇస్లాం మతంలో ఉన్నాను. కానీ పెరిగాక క్రిస్టియన్ మతంలోకి చేరాను. దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు విషయం ఏమిటంటే.. మా అమ్మ నాన్న ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మా నాన్న ఇస్లాం మతానికి చెందిన వారు కాగా.. మా అమ్మ క్రిస్టియన్ మతస్థురాలు.. అలా వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన తర్వాత నేను పుట్టాక కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత అమ్మానాన్నల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే నేను పుట్టగానే మా అమ్మ నాన్న నాకు రెజీనా అని పేరు పెట్టారు. ఇక వీళ్ళ విడాకుల తర్వాత మా అమ్మ క్రిస్టియన్ మతంలోకి మళ్లీ మారిపోయింది. కాబట్టి నా పేరు చివర కసాండ్రా అనే పేరుని కూడా యాడ్ చేసింది..అయితే నేను ఎక్కువగా కుల మతాలను అస్సలు పట్టించుకోను. నేను అన్ని రకాల దేవుళ్లను మొక్కుతాను. గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకు కూడా వెళ్తాను. కులం, మతం విషయంలో నాకు ఎలాంటి పట్టింపులు లేవు” అంటూ రెజీనా కసాండ్రా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రేమ, పెళ్లి విషయంలో రూమర్స్..
ప్రస్తుతం రెజీనా కసాండ్రాకి సంబంధించిన ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక రెజీనా కసాండ్రాకి 34 ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే రెజినా కసాండ్రా సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అటు మెగా హీరోతో పాటు ఇటు రెజీనా కూడా పెళ్లికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.వీరిద్దరు వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి . మరి చూడాలి పెళ్లి విషయంలో రెజినా కసాండ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఇండస్ట్రీకి సంబంధించిన హీరోని పెళ్లి చేసుకుంటుందా..లేక వేరే ఎవరినైనా పెళ్లాడుతుందా అనేది వేచి చూడాలి.