Tan Removing Face Pack: వేసవికాలంలో తీవ్రమైన సూర్యకాంతి కారణంగా స్కిన్ టాన్ పెరగడం సర్వసాధారణం. మీ చర్మం రంగు మారడం ప్రారంభం అయితే.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ చర్మం నుండి టాన్ తొలగించి మళ్ళీ మెరిసేలా చేయడానికి సహాయపడే, సులభంగా ఇంట్లో తయారుచేసుకుని వాడే స్క్రబ్‌లు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి.
సమ్మర్ రాగానే సూర్య కిరణాలు చర్మాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా బయటకు వెళ్ళగానే మీ ముఖం, మెడ , చేతులు టాన్ అయిపోతాయి. అంతే కాకుండా మీ రంగు కూడా మునుపటిలా కనిపించదు. ఇలాంటి పరిస్ధితిలో మీరు తరచుగా టానింగ్ వల్ల ఇబ్బంది పడుతుంటే , పార్లర్‌లో సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేసుకోవాలనుకుంటే.. ఇంట్లో లభించే వస్తువులతో తయారు చేసిన ఈ స్క్రబ్‌లు మీకు సహాయపడతాయి. ఈ స్క్రబ్‌లను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి, పసుపు, పెరుగుతో స్క్రబ్:
ప్రతి చర్మ సమస్యకు శనగపిండి, పసుపు , పెరుగు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా టాన్ తొలగించడానికి..మాత్రం ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి, చిటికెడు పసుపు , 1 చెంచా పెరుగు తీసుకోండి . దీన్ని బాగా కలిపి పేస్ట్ లా చేసి ముఖం, మెడ లేదా చేతులకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత సున్నితంగా వాష్ చేయండి. శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా పసుపు మీ చర్మం యొక్క రంగును పెంచుతుంది. పెరుగు కూడా ముఖ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
కాఫీ పౌడర్, తేనె స్క్రబ్:
చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో కాఫీ పౌడర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికి కొంచెం తేనె కలిపి స్క్రబ్ సిద్ధం చేసి కూడా ఉపయోగించవచ్చు. 1 టీస్పూన్ తేనెను 1 టీస్పూన్ కాఫీ పౌడర్ తో కలిపి, టాన్ అయిన ప్రదేశంలో 5-7 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
ఓట్స్, టమాటో స్క్రబ్:
మీ చర్మం సున్నితంగా ఉంటే ఈ స్క్రబ్ మీకు సరైనది. 1 చెంచా ఓట్స్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ సగం టమాటో రసం కలపండి. ఈ పేస్ట్‌ని చేతులతో ముఖ చర్మంపై అప్లై చేసి, రుద్దుతూ 10 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేయండి. టమాటోలో ఉండే సిట్రిక్ యాసిడ్ టాన్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఓట్స్ చర్మాన్ని స్క్రబ్ చేస్తుంది.
Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
బియ్యం పిండి, కలబంద జెల్ స్క్రబ్:
బియ్యం పిండి చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై టాన్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికి కలబంద జెల్ కలపడం వల్ల చర్మానికి చల్లదనం లభిస్తుంది. అంతే కాకుండా చర్మం కూడా తాజాగా ఉంటుంది. ఒక చెంచా బియ్యం పిండి తీసుకుని.. దానికి 1 చెంచా కలబంద జెల్ వేసి పేస్ట్ లా చేయాలి. ఈ స్క్రబ్‌ని చర్మంపై 5-7 నిమిషాలు మసాజ్ చేసి, తర్వాత కడిగేయండి. తరచుగా ఇలా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.