Skin Care: ముఖం అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ముఖంపై 3 రకాల పదార్థాలను ఉపయోగించడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది.
కాలుష్యం, దుమ్ము, అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా, చర్మం తన మెరుపును కోల్పోవడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా.. రకరకాల ఫేస్ క్రీములు, సీరమ్‌లు , ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలు కొన్నిసార్లు చర్మానికి హాని కలిగిస్తాయి.
ఇలాంటి పరిస్థితిలో.. హోం రెమెడీస్, సహజ వస్తువులు చర్మానికి మేలు చేస్తాయి. వీటిని మీ రోజువారీ స్కిన్ కేర్‌లో ఉపయోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా మీరు కోల్పోయిన మెరుపును కూడా తిరిగి పొందవచ్చు. చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడంలో సహాయపడే హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి సహజ మెరుపునిచ్చే 3 విషయాలు:
అలోవెరా జెల్ :
చర్మ సంరక్షణకు కలబందను అమృతంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి, ఇ , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో అంతే కాకుండా ముఖంపై మచ్చలను తగ్గించి కాంతివంతం చేయడంలో సహాయపడతాయి. చర్మాన్ని లోపలి నుండి పోషించడంలో కూడా ఉపయోగపడతాయి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు, తాజా కలబంద జెల్ ను మీ ముఖం మీద అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. కొన్ని రోజుల్లోనే చర్మం ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభిస్తుంది.
రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ సహజ టోనర్‌గా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మం యొక్క రంగును సమతుల్యం చేస్తుంది. ప్రతి రోజు ఉదయం ముఖం వాష్ చేసిన తర్వాత , రాత్రి పడుకునే ముందు, ఒక దూదిని రోజ్ వాటర్‌లో ముంచి, మీ ముఖం మీద అప్లై చేయండి. ఇది చర్మ రంధ్రాలను చిన్నగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా తాజాగా ఉంచుతుంది. చర్మం మృదువుగా మారేలా చేస్తుంది.
Also Read: ఈ ఒక్కటి అప్లై చేస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
కొబ్బరి నీరు:
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి డీటాక్స్ చేసి, చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు కావాలంటే.. మీరు దానిని కాటన్ సహాయంతో మీ ముఖానికి కూడా అప్లై చేయవచ్చు. ఇది ముఖంపై చల్లదనాన్ని, మెరుపును అందిస్తుంది.