Jayam Ravi Devorce Case: కోలీవుడ్ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం కోలీవుడ్ లో,చర్చనీయంశంగా మారింది. 2009లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల విడాకుల నిర్ణయం తన వ్యక్తిగతమని, జయం రవి తెలిపారు. అయితే ఆర్తి ఈ నిర్ణయం తనకు తెలియకుండా, జయం రవి ప్రకటించారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆర్తి నెలకు 40 లక్షల భరణం కోరుతూ, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు వీరి ఇరువురికి స్ట్రీట్ ఆర్డర్స్ ను జారీ చేసింది.. ఆ వివరాలు చూద్దాం..
జయం రవి – ఆర్తికి కోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్స్..
జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది. ఆర్తి నెలకు 40 లక్షల భరణం కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో ఆమె జయం రవి, తనని ఇంటి నుండి గెంటేసారని విడాకులు తీసుకోవడానికి, మా ఇద్దరి మధ్య మరో వ్యక్తి రావడమే కారణమని ఆరోపించారు. ఈ ఆరోపణలు కోలీవుడ్లో సంచలనాన్ని సృష్టించాయి. అయితే జయం రవి, ఆర్తి ఆరోపణలను ఖండిస్తూ ఇరుకుటుంబ పెద్దలతో చర్చించిన తర్వాతే, నేను విడాకుల నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఈ కేసులో ఇరుపక్ష వాదన విన్న తరువాత, మీకు మీరే కొట్టుకుంటే మేమెందుకు అని వ్యాఖ్యానిస్తూ ఇరుపక్షాలను ఉద్దేశించి కఠిన ఆదేశాలను కోర్టు జారీ చేసింది… ముఖ్యంగా జయం రవి, ఆర్తి ఇద్దరు బహిరంగంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియా, ఇతర మీడియాల ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల వారి కుటుంబ గొప్యత దెబ్బతింటుందని కోర్టు హెచ్చరించింది.
కోర్టు లో విచారణ సాగుతుంది.
ఆర్తి డిమాండ్ చేసిన 40 లక్షల భరణం పై కోర్టు విచారణ సాగుతుంది. రవి ఆర్థికస్థితిగతులు ఆర్తి జీవన భృతి అవసరాలను పరిగణలోకి తీసుకొని కోర్టు తదుపరి తుది నిర్ణయం తీసుకోనుంది. వీరి కుమారుల సంరక్షణ మరియు విద్యపై కూడా కోర్టు దృష్టి సారించింది. మూడో వ్యక్తి ఆరోపణలపై కోర్టు ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆరోపణలు నిజమైతే విడాకుల కేసు మరింత క్లిష్టం గా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా కోర్టు వీరిద్దరికి స్ట్రీట్ ఆర్డర్స్ ఇవ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
నిర్మాత సుజాత ఆరోపణ ..
జయం రవి విడాకుల విషయంపై ఆర్తి తల్లి సుజాత ఆరోపణలు చేశారు. ఆర్తి తల్లి ప్రొడ్యూసర్ సుజాత జయం రవి గురించి పోస్ట్ చేసారు.అతనిని కొడుకులా చూసుకున్నానని, అతనికోసం 100 కోట్లు అప్పు చేసి సినిమాలు నిర్మించాలని అయినప్పటికీ అతను తన కుటుంబాన్ని సంవత్సర కాలం నుంచి దూరం పెట్టాడని, ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే సుజాత జయం రవితో నిర్మించిన సినిమాలలో అడంగమారు, భూమి, సైరన్, వంటివి సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.
Mani Ratnam: మణిరత్నం లవ్ స్టోరీ… లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరో.. ఎవరంటే.!?