E-Paper
Advertisement

క్యాబేజీ పప్పు ఇలా చేస్తే..ఎవ్వరైనా లొట్టలేసుకుంటూ తింటారు!

క్యాబేజీ పప్పు ఇలా చేస్తే..ఎవ్వరైనా లొట్టలేసుకుంటూ తింటారు!
Advertisement

Cabbage pappu recipe: మనం రోజూ తీసుకునే.. ఆహారంలో పప్పు లేనిదే ముద్ద దిగదు.టమాటా పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు అని రోజూ ఇలా ఏదో ఒకటి తింటుంటాం. అయితే క్యాబేజీతో ఎప్పుడైనా పప్పు ట్రై చేశారా? క్యాబేజీని కేవలం పోపు కూరలా లేదా ఫ్రైలానే కాకుండా, పప్పుతో కలిపి వండితే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. క్యాబేజీ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలు సాధారణంగా క్యాబేజీ కూర అనగానే తినడానికి మొండికేస్తుంటారు. కానీ ఇలా పప్పు రూపంలో.. చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ క్యాబేజీ పప్పు రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

కందిపప్పు: 1 కప్పు

Advertisement

తరిగిన క్యాబేజీ తురుము: 2 కప్పులు

టమాటాలు: 2 (సన్నగా తరిగినవి)

Advertisement

పచ్చిమిరపకాయలు: 4 లేదా 5

ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)

పసుపు, ఉప్పు: తగినంత

కారం, ధనియాల పొడి: అర స్పూన్

చింతపండు: చిన్న నిమ్మకాయ సైజ్ అంత

తాలింపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా ఇంగువ

నూనె లేదా నెయ్యి: 2 స్పూన్లు

తయారీ విధానం:

1. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. అందులోనే సన్నగా తరిగిన క్యాబేజీ తురుము, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు పోయాలి. కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూడాలి. ఉడికిన పప్పును పప్పు గుత్తితో లేదా గరిటతో.. మెత్తగా మెదుపుకోవాలి. క్యాబేజీ , పప్పు చక్కగా కలిసి పోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో రెండు స్పూన్ల నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగ పప్పు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత దంచిన.. వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.

Also Read: మునగాకు పచ్చడి ఇలా చేస్తే..అద్భుతమైన రుచితో పాటు ఫుల్ ప్రొటీన్స్!

2.తాలింపు వేగిన తర్వాత, ముందుగా ఉడికించి మెదుపుకున్న క్యాబేజీ పప్పును అందులో వేయాలి. తగినంత ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు రసం (లేదా గుజ్జు) పోసి బాగా కలపాలి.పప్పు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మీడియం మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే క్యాబేజీ పప్పు రెడీ.

ఈ క్యాబేజీ పప్పు వేడివేడి అన్నంతో పాటు చపాతీ లేదా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ..ఎంతో రుచి కరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడానికి ఈ రెసిపీ బెస్ట్. మీ ఇంట్లో అందరూ మెచ్చేలా ఈ క్యాబేజీ పప్పును ఈసారే తప్పకుండా ట్రై చేయండి!

Related News

మునగాకు పచ్చడి ఇలా చేస్తే..అద్భుతమైన రుచితో పాటు ఫుల్ ప్రొటీన్స్!

ఎక్కువగా ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా? ఈ భగవద్గీత శ్లోకం మీ కోసమే

దీపావళి టపాసుల పొగతో కళ్లు, ఊపిరితిత్తులకు ప్రమాదం.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి

పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వకుండా వారి ప్రతి అడుగుపై నిఘా పెడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు

జిమ్ చేసేందుకు ఎక్కువ సమయం లేదా? ఫిట్‌గా ఉండేందుకు 20 నిమిషాలు వర్కౌట్ ప్లాన్ మీ కోసమే

చాణక్య నీతి.. ఈ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండండి.. మీ మనుసుతో ఆడుకుంటారు

హోటల్ స్టైల్ పన్నీర్ చిల్లీ.. ఇంట్లోనే తయారు చేయండి.. రెసిపీ ఇదిగో

Big Stories

Advertisement
×