E-Paper
Advertisement

ప్రాణభయంలో బిగ్ బీ..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సాయంతో ఫ్యాన్స్ కు అభివాదం!

ప్రాణభయంలో బిగ్ బీ..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సాయంతో ఫ్యాన్స్ కు అభివాదం!
Advertisement

Amitabh Bachchan: బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఆదివారం అభిమానుల కోసం కొంత సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ముంబైలోని తన నివాసం జల్సా నుంచి ప్రతి ఆదివారం తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను కలుస్తూ ఉంటారు. అయితే ఈ ఆదివారం కూడా ఈయన అభిమానులను కలిశారు కానీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సహాయంతో ఈయన అభిమానుల కోసం రిస్క్ చేస్తూ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు.

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు..

ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జుహులో టైగర్ ష్రాఫ్ వాహనంపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపారు. అప్పటినుంచి బాలీవుడ్ సెలబ్రిటీలందరూ అప్రమత్తమయ్యారు. ఎక్కడికి వెళ్ళినా హై సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లతో సెలబ్రిటీలు బయటకు వస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)సైతం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ (Bullet Proof Glass)సహాయంతో ప్రేక్షకుల ముందుకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రిస్క్ చేసి ఫాన్స్ ముందుకు బిగ్ బీ..

Advertisement

అమితాబ్ బచ్చన్ కోసం ఎదురుచూసే అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈయన ప్రతి ఆదివారం సాయంత్రం తన ఇంటి బయట ఎదురు చూస్తున్న అభిమానులకు అభివాదం చేస్తూ ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆనవాయితీని అమితాబ్ పాటిస్తూ ఉన్నారు. ఇలా తనకోసం వచ్చే అభిమానులకు కొన్ని నిమిషాల పాటు ఈయన కనిపించి సంతోషంగా నమస్కరిస్తూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఇక నవంబర్ ఒకటవ తేదీ అభిమానులను కలవడం కోసం ఈయన పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కాల్పుల కలకలం ఉన్న నేపథ్యంలో అమితాబ్ చాలా జాగ్రత్తలను తీసుకుంటూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి ఈయన తన అభిమానులకు అభివాదం చేశారు.

అభిమానుల కోసం రిస్క్ చేసిన అమితాబ్..

ఇలా మూడు వైపులా పూర్తిగా కవర్ చేసేలా ఏర్పాటు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నిలబడి బిగ్ బీ అభిమానులను కలిశారు అయితే ఈయనకు సహాయంగా పక్కనే తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉండటం గమనార్హం. అమితాబ్ హై సెక్యూరిటీ నడుమ రిస్క్ చేస్తూ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా అమితాబ్ బచ్చన్ తన అభిమానులను కలవడానికి చేసిన రిస్క్ పట్ల కొంతమంది ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించగా మరి కొంతమంది మాత్రం ఇలా చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసుకొని ఆయన అభిమానుల ముందుకు రావడానికి చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ సమయంలో ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియని నేపథ్యంలో సెలబ్రిటీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి.

Advertisement

Also Read: నాకు ఆ పాటకు సంబంధం లేదు.. యూటర్న్ తీసుకున్న జిమ్ జిమ్ తార సింగర్!

Related News

గురూజీ – వెంకీ మ్యాజిక్ వర్కౌట్ కాలేదా? ఏకంగా అన్ని కోట్లు నష్టమా?

నాకు ఆ పాటకు సంబంధం లేదు.. యూటర్న్ తీసుకున్న జిమ్ జిమ్ తార సింగర్!

నెపోటిజం చూపిస్తున్న నిహారిక.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన టీమ్!

రూ.200 కోట్ల ఆర్థిక దోపిడీ కేసులో నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు మరోసారి సమన్లు!

ఫేక్ గురూ అంటూ పూనమ్ కౌర్ మరో షాకింగ్ పోస్ట్!

అబ్బా.. ఏం అందం! ప్రిన్సెస్‌లా మారిపోయిన రవీనా కూతురు!

రాజీవ్ వర్మ, మలైకా జంటగా కొత్త సినిమా ప్రారంభం.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్!

Big Stories

Advertisement
×