Aadarsha kutumbam Ak 47:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని వరుస సినిమాలు చేస్తూ.. భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు వెంకటేష్ (Venkatesh ) అలాంటి ఈయన తొలిసారి మాటల మాంత్రికుడు గురూజీ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య చేసిన చిత్రం ఆదర్శ కుటుంబం ఏకే 47. అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకోవడం సంచలనంగా మారింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదర్శ కుటుంబం. రాజ్ ప్రజ్వల్, యువినా పార్థవి, నివేదా పేతురాజు, నారా రోహిత్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా రూ.9.75 కోట్లు రాబట్టింది. రెండవ రోజు రూ.10.4 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. మూడవరోజు రూ.11.25 కోట్లు సొంతం చేసుకుంది. అయితే మూడు రోజుల్లో ఈ సినిమా ఇండియా వైడ్ రూ.31.40 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉండగా మరొకవైపు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం మూవీకి ఇప్పటి వరకు 35% నుండి 40% వరకు నష్టాలు మిగిలేలా ఉందని డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య సినిమా విడుదల కాగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు టాక్ పరంగా థియేటర్‌కు ప్రేక్షకులు సరిగ్గా రాకపోవడం వల్ల కలెక్షన్లు తగ్గుతున్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
also read:ఎట్టకేలకు లైవ్ లో దీపికాకు ప్రపోజ్ చేసిన జీవన్!
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. తెలంగాణ నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకోగా.. యునైటెడ్ స్టేట్స్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టారు. ఇక యూకే , యూరప్ లో డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్, సమయ ఎంటర్టైన్మెంట్ దక్కించుకోగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో టాలీ మూవీస్, కెనడాలో నికుంబల మూవీస్ ఈ సినిమా పంపిణీ బాధ్యతలను చేపట్టాయి.