Stree Nidhi: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడలో స్త్రీ నిధి సొమ్ము పక్కదారి పట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా సంఘాల డబ్బులతో గ్రామ దీపిక సొంత వ్యవహారాలు వాడుకున్నట్టు సమాచారం. మండల పరిధిలోని 21 మహిళా సంఘాల నుంచి సేకరించిన రూ.24 లక్షల 98 వేల 885 బ్యాంకులో జమ చేయకుండా సొంత అవసరాలకు వినియోగించినట్లు సోషల్ ఆడిట్‌లో అధికారులు గుర్తించారు.
దీంతో స్త్రీ నిధి ఆర్‌ఎం రవీందర్ నాయక్ విచారణలో వెలుగులోకి వచ్చిన నిధుల గోల్‌మాల్ అయ్యాయని లెక్కల్లో తేడాలతో అడ్డంగా గ్రామ దీపిక దొరకి పోయింది. నిధుల రికవరీ కోసం అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 లక్షలు చెల్లించేలా బాండ్ పేపర్‌పై ఆమేతో ఒప్పందం చేసుకున్నారు. ఇక మిగిలిన సుమారు రూ.19 లక్షలు మరికొన్ని నెలల్లో చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పడుతున్నా పర్యవేక్షించాల్సిన సీసీలు, ఐకేపీ ఏపీఎంలు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారం బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మహిళా సంఘాల సొమ్ముకు భద్రత ఏది..? అక్రమాలకు సహకరించిన వారెవరు..? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేక బాండ్ పేపర్లతోనే వ్యవహారాన్ని ముగిస్తారా.. అనేది చూడాలి.
Also Read: నెపోటిజం చూపిస్తున్న నిహారిక.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన టీమ్!